అమరావతి: నంది అవార్డుల ప్రకటనపై ఏపీ సర్కార్ పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అయితే ఆయన స్పందించిన తీరు వివాదాస్పదంగా మారింది.
లోకేష్ ఏమాన్నారంటే...
నంది అవార్డుల ప్రకటనపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. నంది అవార్డుల ప్రకటనను ఇద్దరు, ముగ్గురు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు..అది కూడా హైదరాబాద్ లో కూర్చోని విమర్శిస్తున్నారు. ఏపీలో కనీసం ఆధార్ కార్డు, ఓటరుకార్డు లేని వారు విమర్శిస్తే ఎలా...అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో కూర్చోని ఏం చేయాలో చెబితే ప్రజలు హర్షించబోరని విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.