Nellore Lorry Accident: నెల్లూరులో లారీ బీభత్సం.. ఆరుగురు దుర్మరణం.. రక్తసిక్తంగా మారిన రోడ్డు..

Nellore Lorry Accident:చేపల లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పింది.  టాటా ఏస్ తో పాటు, పలు బైక్ లను ఢీకొట్టుకుంటు వెళ్లి చెట్టు వద్ద ఆగిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 11, 2025, 01:54 PM IST
  • నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..
  • సహాయక చర్యల్ని చేపట్టిన అధికారులు..
Nellore Lorry Accident: నెల్లూరులో లారీ బీభత్సం.. ఆరుగురు దుర్మరణం.. రక్తసిక్తంగా మారిన రోడ్డు..

Lorry Accident in Nellore Andhra pradesh several dead: ఇటీవల రోడ్డు ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. అసలు చాలా మంది రోడ్ల మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఏ ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో బెంబెలెత్తిపోతున్నారు. మన మార్గంలో మనం వెళ్లిన కూడా ప్రమాదంలో ఎక్కడ పడతామో అంటూ చాలా మంది  జనాలు భయంతో తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా.. నెల్లూరులో మరో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. 

Add Zee News as a Preferred Source

నెల్లూరు జిల్లాల్లో లారీ బీభత్సం సృష్టించింది. చింతారెడ్డిపాలెం సర్కిల్ దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అతి వేగంతో వెళ్తు అదుపు తప్పింది. ఈ క్రమంలో.. రోడ్డుపక్కన వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లింది. టాటాఏస్, పలు బైక్ లు,  రోడ్డుపక్కన ఉన్నవారిని బలంగా  ఢీకొట్టుకుంటూ వెళ్లింది.

Read more: Tirumala Temple: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఏకంగా శిలాతోరణం వరకు క్యూలైన్‌లు.. దర్శనాలకు ఎన్నిగంటలంటే..?

ఈ ఘటనలో ఆరుగురు ఘటన స్థలంలోనే చనిపోయారు. స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. అనేక మంది ఈ ఘటనలో  గాయపడ్డారు. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు సహాయక చర్యల్ని చేపట్టారు. ఘటనకు గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News