Love Marriage Tragedy: ప్రేమించారు.. పెళ్లి చేసుకున్నారు.. వివాహమైన కొన్ని నెలల తర్వాత మనుషులు నరరూప రాక్షసుల్లా మారిపోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతులను అత్యంత దారుణంగా హతమారుస్తున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలో మూడు దారుణ హత్యలు చోటుచేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమ పెళ్లి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: AP Cabinet Decisions: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. మంత్రివర్గ నిర్ణయాలు ఇవే!
విశాఖపట్టణంలోని మధురవాడలో ప్రసవానికి సిద్ధమైన తన భార్యను నిద్రలోని గొంతు నులిమి ప్రియుడు దారుణంగా హత్య చేసిన సంఘటన జరిగి 24 గంటలు కాలేదు. ఏపీలో మరో చోట ప్రేమించి పెళ్లి చేసుకున్న కుమార్తెను ఆమె కుటుంబసభ్యులు అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. పెళ్లి చేసుకుని మూడు నెలలు కూడా సక్రమంగా కాపురం చేయలేదు. కానీ అప్పుడే ఆమెను హతమార్చారు.
Also Read: Fishing Ban In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఆగిన చేపల వేట.. 61 రోజులు బంద్
పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. చిత్తూరులోని మసీదు మట్ట ప్రాంతానికి చెందిన యాస్మిన్ భాను పూతలపట్టు మండలానికి చెందిన సాయి తేజతో నాలుగు సంవత్సరాలుగా ప్రేమాయణం సాగించింది. ప్రేమను పెళ్లిగా మలచుకోవాలని భావించి ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరులో యాస్మిన్ భాను, సాయి తేజ్ వివాహం చేసుకున్నారు. పెద్దలకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో తిరుపతి ముత్యాల రెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌లో తమకు రక్షణ కావాలని ఫిబ్రవరి 13వ తేదీన ఈ జంట కోరింది. యాస్మిన్ భాను తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు పంపిచారు.
అయితే యాస్మిన్ భానుతో ఆమె తల్లిదండ్రులు తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. యాస్మిన్ భాను తండ్రికి ఆరోగ్యం సరిగా లేదని.. ఇంటికి పంపించాలని ఆమె కుటుంబసభ్యులు సాయి తేజ్‌ను కోరారు. ఆదివారం 11 గంటలకు యాస్మిన్ భానును చిత్తూరుకు సాయితేజ్ తీసుకువచ్చి దింపాడు. అక్కడి నుంచి యాస్మిన్ భానుని ఆమె సోదరుడు కారులో తీసుకెళ్లాడు. మంగళవారం ఫోన్ చేసి యాస్మిన్ భాను మృతి చెందిందని తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు.
ఈ వార్తతో దిగ్భ్రాంతికి గురయిన సాయితేజ్ ఆమె తల్లిదండ్రులే హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. చిత్తూరు 2వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. సాయితేజ, యాస్మిన్ ప్రేమ వ్యవహారం యువతి కుటుంబసభ్యులకు అంగీకారం లేదు. ప్రేమ పెళ్లి చేసుకున్న యాస్మిన్‌ను ఇంచికి పిలిపించి హత్య చేశారని సాయితేజ ఆరోపిస్తున్నాడు. కాగా యాస్మిన్ తండ్రి, ఆమె సోదరుడు పరారీలో ఉండడంతో ఆ అనుమానాలకు బలం చేకూరుతోంది. మొన్న చంద్రగిరి సమీపంలో నర్సింగాపురంలో కులాంతర వివాహంతో హత్య జరగగా.. నేడు చిత్తూరులో ఇలా జరిగింది. దీంతో ఏపీలో ప్రేమ వివాహాలు దుఃఖాంతంగా ముగియడం కలచివేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter









