)
Madanapalle Incident Accused Suicide: మదనపల్లెలో బాలికపై జరిగిన హత్యాచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంది. బాలికను దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆ తర్వాత చిన్నారిని హత్య చేసిన ఉదంతంపై ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడైన కులవర్ధన్‌ను నిర్ధాక్షిణంగా వ్యవహరించి, బాలిక మృతికి తగిన న్యాయం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఘటనకు పాల్పడిన కులవర్ధన్ తొలుత పరారీలో ఉండగా.. ఈరోజు ఉదయాన్నే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడని జిల్లా ఎస్పీ నిర్ధారించారు. అయితే నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల స్థానికులు సంబరాలు చేసుకుంటున్నారు. రాక్షసుడికి తగిన గతి జరిగిందని టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏం జరిగిందంటే?
స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. నిన్న (మంగళవారం) మదనపల్లె పరిధిలో ఒక మైనర్ బాలికపై హత్యాచారం జరిగింది. కులవర్ధన్ అనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆ తర్వాత ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అయితే తొలుత నిందితుడు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..స్టేషన్‌కు తరలిస్తున్న క్రమంలో అతడు తప్పించుకున్నాడు.
నిందితుడు పరారీలో ఉండడం వల్ల అతడి కోసం వెతికేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమించింది. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగగా.. వారంతా మదనపల్లెను జల్లెడ పట్టారు. చివరికి డ్రోన్లు, డాగ్ స్క్వాడ్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు తెలిసింది.
అలా నిందితుడు కులవర్ధన్ ఆచూకీ కోసం వెతుకుతున్న తరుణంలో బుధవారం అనగా ఫిబ్రవరి 18న ఉదయం స్థానిక చెరుపులో ఓ మృతదేహం తేలియాడుతూ ఉంది. అది నిందితుడే అని పోలీసులు నిర్ధారించారు. పోలీసుల చెర నుంచి తప్పించుకున్న నిందితుడు.. భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నిందితుడు కులవర్ధన్ మృతిపట్ల మృతురాలు బాలిక తల్లి స్పందించింది. కులవర్ధన్ బతికే ఉంటే తానే చంపేదాన్ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అతడి మృతి పట్ల మదనపల్లెలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. చిన్నారిని బలి తీసుకున్న కిరాతకుడు మట్టికరిచిపోయాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook