Tragedy In Srisailam: మహా శివరాత్రి వేళ శ్రీశైలంలో అపశ్రుతి.. నదిలో తండ్రీకొడుకులు జల సమాధి

Son And Father Drowned In Krishna River: మహా శివరాత్రి పర్వదినం వేళ శ్రీశైలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివుడిని దర్శించుకునేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు పుణ్య స్నానం ఆచరిస్తుండగా నీటిలో కొట్టుకునిపోయారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 26, 2025, 01:42 PM IST
Tragedy In Srisailam: మహా శివరాత్రి వేళ శ్రీశైలంలో అపశ్రుతి.. నదిలో తండ్రీకొడుకులు జల సమాధి

Krishna River Tragedy: మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం వెళ్లిన ఆ గ్రామం బృందంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహా శివరాత్రి సందర్భంగా నదిలో పుణ్యస్నానం ఆచరించడానికి వెళ్లిన తండ్రీ కుమారులు ప్రమాదవశాత్తు నీటి ఉధృతిలో కొట్టుకుపోయారు. మొదట కుమారుడు స్నానం చేస్తూ కాలు జారి నీటిలో పడిపోగా కుమారుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించిన తండ్రి కూడా నీటిలో మునిగిపోయాడు. వారు కృష్ణా నది నీటిలో గల్లంతయ్యారు. అప్పటి వరకు భక్తితో.. ఆనందంలో మునిగిన ఆ గ్రామస్తులు ఈ సంఘటనలో తీవ్ర విషాదంలో మునిగారు. శివరాత్రి వారికి కాళరాత్రిలా మారింది. ఏపీలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: Hyderabad Water: హైదరాబాద్‌లో డేంజర్‌ బెల్స్‌.. తాగునీటి కష్టాలతో నగరవాసులు విలవిల

ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొల్లికుళ్ల గ్రామం నుంచి శ్రీశైలం క్షేత్రానికి గ్రామస్తులు బుధవారం తరలివెళ్లారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా గ్రామానికి చెందిన 25 మంది బంధుమిత్రులు బస్సు మాట్లాడుకుని శ్రీశైలం బయల్దేరారు. మరో బస్సులో మరికొంత మంది శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం కొండ కింద కృష్ణానది ఒడ్డున పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం ఉదయం పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా పెరుగు గురవయ్య (40) కుమారుడు (8) కాలి జారి కింద పడ్డాడు. స్నానం చేస్తూ జారిన కొడుకును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తండ్రి  కింద జారిపడి నీటిలో మునిగారు.

Also Read: Kedar Selagamsetty: అల్లు అర్జున్‌ సన్నిహితుడు, యువ నిర్మాత కన్నుమూత.. సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి

అనంతరం నదీ ప్రవాహానికి తండ్రీకొడుకులు కొట్టుకుపోయారు. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే నీటిలోకి వెళ్లిపోవడంతో గ్రామస్తులు గజ ఈతగాళ్లకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న అధికారులు, పోలీసులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. తండ్రీకొడుకుల మృతదేహాలు లభించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు గురవయ్య రైతు కాగా అతడికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. లేక లేక కలగిన సంతానం నీటిలో కొట్టుకుపోతుండడంతో తట్టుకోలేక ఆ తండ్రి కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో కొడుకుతోపాటు తండ్రి కూడా ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన ఆ గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News