Mahanadu 2025: గోంగూర చికెన్‌.. తాపేశ్వరం కాజా.. బిర్యానీ- పసుపు పండుగలో తెలుగు తమ్ముళ్లకు నోరూరించే వంటకాలు..

Mahanadu Menu List: తెలుగుదేశం పార్టీ (TDP) నిర్వహిస్తున్న మహానాడు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జరగనుంది. మే 27 నుంచి 29 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదటిసారిగా కడపలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఒకే చోట చేరి భవిష్యత్తు పార్టీ భవిష్యత్తు,  రాజకీయ వ్యూహాలు చర్చించుకునే ఒక వార్షిక మహాసభ.

Written by - Renuka Godugu | Last Updated : May 27, 2025, 07:49 AM IST
Mahanadu 2025: గోంగూర చికెన్‌.. తాపేశ్వరం కాజా.. బిర్యానీ- పసుపు పండుగలో తెలుగు తమ్ముళ్లకు నోరూరించే వంటకాలు..

Mahanadu Menu List: 2025 టీడీపీ మహానాడు (Mahanadu) కడప జిల్లాలో ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించే ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు నాయకులు, అభిమానులు ఒకే చోట చేరి భవిష్యత్తు కార్యాచరణ కోసం సమావేశం అవుతారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈసారి మరింత ప్రత్యేకంగా కడప జిల్లాలో ఈ ఉత్సవాలు ప్రారంభించడం ఆసక్తి సంతరించుకుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా వైసీపీ ప్రతిపక్ష అధినేత అయిన వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం విశేషం.

Add Zee News as a Preferred Source

5 లక్షల మంది..
పచ్చని జెండాలతో ప్రతి గడప పచ్చదనం పులుముకుంది. పచ్చని తోరణాలు అలంకరించి వేదికలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 2024 ఎన్నికల భారీ గెలుపు తర్వాత టీడీపీ ఏర్పాటు చేసిన మొదటి మహానాడు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ములు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఈ సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు .

అయితే ఎప్పటిలాగే ప్రతిసారి మాదిరి టిడిపి మహానాడులో భవిష్యత్తు దిశను నిర్దేశించే పార్టీ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచే దిశగా ఈ కార్యక్రమం ఉంటుంది. పార్టీకి కొత్త మార్గదర్శకత్వాన్ని ఉత్సాహాన్ని అందించేలా ఈ సమావేశం జరగనుంది. 

140 ఎకరాల్లో..
టీడీపీ మహానాడు కడప జిల్లాలోని చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. 140 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ తో పాటు వేదికపై దాదాపు 450 మందికి పైగా కూర్చోవడానికి భారీ ఏర్పాట్లు చేయడం పూర్తయింది. ఈరోజు ఉదయం 8:30 గంటలకు ప్రారంభం అవుతుంది.

నోరూరించే వంటకాలు..
ఇక 2025 మహానాడులో తెలుగుతమ్ముళ్లకు నోరూరించే వంటకాలు.. గోంగూర చికెన్ ,వెజిటేబుల్ బిర్యాని, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, తాపేశ్వరం కాజా, దోసకాయ మటన్, బగారా రైస్, చికెన్ కర్రీ, పొంగలి, ఇడ్లీ, టమాటా బాత్, టూటీఫ్రూటీ కేసరి, మామిడికాయ పచ్చడి, గోంగూర ఫుల్ మఖాన, టమాట పప్పు, రోటి పచ్చడి, వంకాయ బఠాణి ఆలూ ఫ్రై, పెసరపప్పు, సమోసా, బిస్కెట్లు, పకోడీ.. వంటి నోరూరించే వంటకాలు ఉండబోతున్నాయి. 

మహానాడు కడప జిల్లాలో ఈసారి అత్యంత ప్రత్యేకత సంతరించుకుంది. ఇందులో పార్టీ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం కూడా తెలుపుతారు. స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, యువగలం, అన్నదాతకు అండ అనే అంశాలపై తీర్మానాలు చేపట్టనున్నారు. ఇక ఫోటో షూట్ తో పాటు రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తారు.

Also Read: నేటి రాశిఫలాలు.. ఈరోజు కర్కాటక రాశివారికి జాయ్‌, ఈ రాశి మాత్రం అత్యంత జాగ్రత్త..  

Also Read: ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే.. ఆరెంజ్‌ తొక్కతో ఇలా చేయండి చాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News