Tirumala News: తిరుమలలో ఎయిర్ గన్, టెలిస్కోప్ కలకలం.. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్..

Tirumala: తిరుమలలో కర్ణాటకకు చెందిన భక్తుడు ఎయిర్ పిస్టల్ ను, టెలిస్కోప్ ను కారులో పెట్టుకుని రావడంను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 9, 2025, 08:47 PM IST
  • తిరుమలలో ఎయిర్ గన్ రచ్చ..
  • ఆందోళనలో భక్తులు..
Tirumala News: తిరుమలలో ఎయిర్ గన్,  టెలిస్కోప్ కలకలం.. రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్..

Man caught with air Pistol and Telescope in tirumala: తిరుమలలో ప్రస్తుతం భారీగా భక్తులు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా కంపార్ట్ మెంట్ లు అన్ని కూడా ఫుల్ గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో ఇటీవల పెరిగిన రద్దీని గమనించి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలలో భక్తులకు దర్శనం కోసం టోకెన్ లు ఇచ్చే కేంద్రాల్ని పెంచింది.

Add Zee News as a Preferred Source

ఈ క్రమంలో తిరుమలలో ఇటీవల అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలలో కొంత మంది అన్యమత ప్రచారం చేస్తున్నారు. తిరుమలలో నిషేధించిన వస్తువుల్ని తీసుకొని వెళ్తున్నారు.  తక్కువ ఎత్తులోస్వామి వారి ప్రధాన ఆలయంపై నుంచి హెలికాప్టర్ లు వెళ్తున్నాయి. ఇది ఆగమశాస్త్రం ప్రకారం అపచారం అని చెప్పిన కూడా వరుసగా ఏదో వివాదాస్పద అంశాలు జరుగుతునే ఉన్నాయి.

ఇటీవల కొంత మంది తిరుమలలో మద్యం తాగినట్లు వీడియో తెగ వైరల్గా మారింది. అయితే.. దీనిపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై టీటీడీ అసత్య ప్రచారం అంటూ కొట్టి పారేసింది.  అయితే.. తాజాగా.. తిరుమలలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అలిపిరివద్ద టీటీడీ సిబ్బంది వాహనాల్ని చెక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకకు చెందిన భక్తుని దగ్గర  కారులో ఎయిర్ గన్, టెలిస్కోప్ ను పోలీసులు గమనించారు.

Read more: Renuka Chowdhaury: జగన్ పుట్టినప్పుడే పీక పిసికేస్తే అయిపోయేది..!.. మరో టీవీ ఛానెల్ డిబెట్ లో రేణుక చౌదరీ రచ్చ..

వెంటనే టీటీడీ విజిలెన్స్ కు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు అతని దగ్గర ఉన్న ఎయిర్ గన్, టెలిస్కోప్ పై ఆరా తీశారు.  ఈ ఘటన వెలుగులోకి రావడంతో అలిపిరి వద్దనున్న భక్తులు టెన్షన్ కు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.   మరోవైపు తిరుమలలో వరుసగా ఏదో ఒక వివాదాస్పద అంశాలు తెర మీదకు వస్తుండటంతో శ్రీవారి భక్తులు మాత్రం ఒకింత ఆందోలనలు వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News