Boy friend cuts off lower nose in piduguralla: ఇటీవల చాలా మంది భార్యభర్తలు తరచుగా ఒకర్ని మరోకరు హత్యలు చేసుకుంటున్నారు. ప్రతిరోజు కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల భార్యలు తమ భర్తల్ని చంపుతుంటే, మరికొన్ని చోట్ల భర్తలు తమ భార్యల్ని చంపుతున్నారు. అంతేకాకుండా కొంత మంది వివాహేతర సంబంధాలు మోజులో పడి కట్టుకున్న వారిని కడతెరుస్తున్నారు.
మరికొన్ని చోట్ల ఆర్థికపరమైన విబేధాలతో తమ వారిపై దాడులు చేసుకుంటున్నారు. మొత్తంగా భార్యభర్తలు ఇటీవల ఎక్కువగా హత్యలు, ఆత్మహత్యలు , సుపారీ గ్యాంగ్ ల ఘటనలతో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని పిడుగు రాళ్లతో అనుకొని ఘటన చోటు చేసుకుంది.
పిడుగురాళ్లలోని మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ కూలీ పనులు చేసి జీవనం సాగిస్తుంది. అయితే ఈమెకు భర్తతో గొడవలు రావడంతో ఆమె దూరంగా ఉంటుంది. ఈమెకు వెంకట్రావు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. వెంకట్రావు సైతం తన భార్యతో గొడవలు పడి విడిపోయి సింగిల్ గా ఉంటున్నాడు. ఇటీవల మరియమ్మ వెంటకట్రావును దూరం పెట్టింది. ఇదే విషయంలో ఇద్దరు గొడవలు పడ్డారు. దీంతో వెంకట్రావు మరియమ్మ మీద కక్ష పెంచుకున్నాడు.
వెంకట్రావు తన స్నేహితుడితో కలిసి మరియమ్మ ఇంటికి వచ్చాడు. అంతే కాకుండా ఆమెతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగింది. ఈ క్రమంలో కోపంతో కోడి అప్పటికే వెంటతెచ్చుకున్న వెంకట్రావు మరియమ్మ ముక్కు కోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. మరియమ్మ అరుపులతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు.
Read more: Ratha Saptami In Tirumala: రథసప్తమి రోజు మినీ బ్రహ్మోత్సవం.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు..
వెంటనే ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. మరియమ్మకు వైద్యులు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. మొత్తంగా మరియమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు వెంకట్రావు పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









