Nagababu Assets: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి జనసేనకు కేటాయించగా మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు నామినేషన్ వేయనున్నారు. జనసేన తరపున పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం లభించింది.
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా జనసేన తరపున మెగా కుటుంబానికి చెందిన నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. దాంతోపాటు దాఖలు చేసిన ఆఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. అఫిడవిట్‌లో ఆస్తులు అప్పుల్ని వివరించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఎంత బాకీ పడ్డాడో , ఎంత అప్పు చెల్లించాల్సి ఉందో వివరించాడు. నాగబాబు ఆస్తుల విలువ 70 కోట్లుగా అఫిడవిట్‌లో చూపించారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు చెల్లించాల్సిన అప్పులను వివరించారు. నాగబాబు చరాస్థుల విలువ 59 కోట్లు బాండ్లు, మ్యూచ్యువల్ ఫండ్స్ రూపంలో ఉన్నాయని తెలిపారు. మ్యూచ్యువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో 55.37 కోట్లు కాగా నగదు 21.81 లక్షలున్నాయి.
బ్యాంకు ఖాతాల్లో 23.53 లక్షలున్నాయని నాగబాబు వెల్లడించారు. బయటి వ్యక్తుల నుంచి 1.03 కోట్లు అప్పు తీసుకున్నానన్నారు. ఇవి కాకుండా 67.28 లక్షల విలువైన బెంజ్ కారు, 11.04 లక్షల విలువైన హ్యుండయ్ కారు ఉన్నాయి. ఇక 57.99 లక్షల విలువైన బంగారం, వెండి ఉన్నాయి. 724 గ్రాముల బంగారంతో పాటు భార్య వద్ద 55 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. వెండి 20 కేజీలు ఉంది. హైదరాబాద్ పరిసరాల్లో 11 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయి.
స్థిరాస్తులు హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్నాయి వీటిలో రంగారెడ్డి జిల్లాలో 5.3 కోట్లు విలువ చేసే 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లాలో 82.80 లక్షలు విలువ చేసే 8.28 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో 53.50 లక్షలు విలువ చేసే 1.07 ఎకరాల భూమి ఉన్నాయి. హైదరాబాద్ మణికొండలో 2.88 కోట్లు విలువ చేసే విల్లా ఉంది. ఇలా మొత్తం స్థిరాస్థుల విలువ 11.20 కోట్లు ఉంది.
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌కు చెల్లించాల్సిన అప్పులు
చిరంజీవి నుంచి 28.48 లక్షలు అప్పు తీసుకున్నానని నాగబాబు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ నుంచి 6.90 లక్షలు అప్పు తీసుకున్నట్టు తెలిపారు. వివిధ బ్యాంకుల్లో ఇంటి రుణం కింద 56.97 లక్షలు, కారు రుణం 7.54 లక్షలు ఉన్నాయి.
Also read: AP Summer Effect: భయపెడుతున్న ఎండలు, ఈ జిల్లాలకు హై అలర్ట్ జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









