
Kurnool Holi Celebrations: హోలీ అంటే గుర్తొచ్చేది రంగులు, కాముని దహనం. కానీ కర్నూలు జిల్లా సంతేకుడ్లూరు గ్రామంలో ఈ పండుగ వచ్చిందంటే జంబలకడిపంబ సినిమా కనపడుతుంది. ఈ రోజున గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని అమ్మాయిలుగా మారిపోతారు. భక్తి శ్రద్ధలతో రతి మన్మథుడికి పూజలు చేస్తారు. ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం.100 ఏళ్ల నుంచి వస్తున్న ఆచారాన్ని ఈ గ్రామంలో హోలీ వేడుకలను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి తరలివస్తారు. అంతేకాదు హైదరాబాద్, బెంగళూరు, ముంబై దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు హోలీ వేడులకకు హాజరై సంబరాలు చేసుకుంటారు..
ఇక సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే చాలు.. మగవారు మగువలై హోలీ పండుగ రోజున గ్రామంలో దర్శనమిస్తారు. మొదటిరోజు గ్రామ దేవతలైన రతీ మన్మధులకు కానుకలు సమర్పించి కొలుస్తారు. రెండవ రోజు రతీమన్మదుల కామ దహనానికి సిద్ధమవుతారు. గ్రామంలోని పురుషులంతా ఆడవారి వేషధారణలో స్వామికి మొక్కులు తీర్చుకుంటారు. ఈ హోలీలో గ్రామ ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి పాల్గొంటారు. తరతరాల కాలం నుండి హోలీ పండుగ రోజు మారువేషాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళుగా చీర కట్టుకొని డప్పు వాయిద్యాలతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు.
తర్వాత రతీ మన్మదుల దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి తిరిగి తమ నివాసాలకు వెళ్ళేటప్పుడు దారిలో తమకు తెలిసిన ఇష్టమైన వ్యక్తులను దూషిస్తారు. ఆ వ్యక్తులు గతంలో చేసిన తప్పులను వెలికి తీస్తారు. ఆ తిట్లే రతీమన్మదుల ఆశీస్సులు అని భావిస్తారు. ప్రతి కుటుంబంలో దేవునికి కానుకలు సమర్పిస్తారు. వైద్య విద్య ఆరోగ్యం సంతానం లేని వారికి సంతానం కలిగే విధంగా కోరిన కోరికలు తీరాలంటే మగవాడు చీర కట్టాల్సిందే.. రెండో రోజు సోమవారం ఉదయం రతీమన్మదుల కామ దహనం చేస్తారు. సాయంకాలం విమానం పోలిన వాహనంలో చిన్నపిల్లలను కూర్చోబెట్టి డప్పు వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహిస్తారు.
మొత్తంగా హోలీ రోజున మగాళ్లు మొత్తం ఆడవారిగా మారిపోయి.. హైలెట్‌గా నిలుస్తారు. వారిని కుటుంబ సభ్యులే ఆలయానికి తీసుకెళ్లడం మరో హైలెట్.. మొత్తంమీద వీరిని చూసిన వారు మాత్రం.. అప్పట్లో వచ్చిన జంపలకిడి పంబను సినిమాను గుర్తు తెచ్చుకుంటున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook