Nadendla Manohar comments on ap govt: ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తాజాగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నికల సమయంలో ఏపీలో ప్రజలకు సుపరిపాలన అందించాలనే టార్గెట్ పెట్టుకుని.. టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయని అన్నారు. అంతే కాకుండా..ఇ ప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారంటే. ఈ క్రెడిట్ అంతా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ కు మాత్రంమే దక్కుతుందని అన్నారు. ఏపీలో ఎక్కడ కూడా ఓట్లు చీలకుండా.. టీడీపీ, జనసేనలు కలిసి ఎన్నికల బరిలో దిగాయని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పవన్ కళ్యాణ్ వల్లనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే అది కేవలం జనసేన పార్టీ వల్లనే
– జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ pic.twitter.com/QOaOk9Q9Wp
— Telugu Scribe (@TeluguScribe) March 10, 2025
మరొవైపు ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములుగా ప్రస్తుతం కీలకపాత్రను పోషిస్తున్నామని అన్నారు. అప్పట్లో పవన్ తీసుకున్న నిర్ణయాలు, త్యాగాలతోనే..ప్రతి ఒక్కర్ని ఒకతాటిపై నిలబడి కూటమిని అధికారంలోకి తెచ్చుకొచ్చామన్నారు. మరొవైపు ఇటీవల పిఠాపురం సీనియర్ టీడీపీ నేత.. వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ను టీడీపీ కేటాయిచలేదు. దీనిపై చాలా మంది పిఠాపురంలో వర్మకు .. పవన్ కళ్యాణ్ చెక్ పెట్టారని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు.
దీనిపై కూడా.. నాదెండ్ల కౌంటర్ ఇచ్చారు. తమకు ఎవర్నిచెక్ పెట్టాల్సిన అవసరంలేదని, వర్మకు ఎమ్మెల్సీ టికెట్ సమస్య.. టీడీపీ అంతర్గత వ్యవహరమన్నారు. పవన్ కళ్యాణ్ కు పిఠాపురం పెట్టని కొట లాంటిదన్నారు. ఈ క్రమంలో నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.కొంత మంది సోషల్ మీడియాలో నాదెండ్ల వ్యాఖ్యల్ని తప్పుగావ్యాప్తి చేస్తున్నారు.
Read more; Nagababu Assets: మెగా బ్రదర్ నాగబాబు ఆస్తుల వివరాలు, చిరంజీవి, పవన్‌లకు ఎంత అప్పు ఉన్నాడంటే
టీడీపీ తమ వల్ల అధికారంలో ఉందని.. చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ లో రాజకీయాలు మారిపోయాయని.. కూటమి అంతర్గతంగా కుమ్ములాటలు, ఒకరంటే మరోకరికి పడటంలేదని గొడవలు.. జరుగుతున్నాయని కొంత మంది వార్తల్ని వైరల్ చేస్తున్నారు. మొత్తంగా నాదెండ్ల మాటలతో మాత్రం కూటమి మధ్యన ఏమైన బేధాభిప్రాయాలు ఉన్నాయా.. అన్నవిధంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









