Nadendla manohar fires on ys jagan: మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా రచ్చగా మారాయి. ఇటీవల ఏపీ చంద్రబాబు సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంత తప్పుల తడకగా ఉందని మాజీ సీఎం జగన్ అన్నారు. అంతే కాకుండా.. కేవలం దీనిలో ఆత్మస్థుతి, పరనిందలు మాత్రమే ఉన్నాయన్నారు. అంతే కాకుండా.. ఎన్నికలలో ఇచ్చిన హమీలను కూడా నెరవేర్చకుండా.. అమలు చేసినట్లు, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు సామాజిక ఆర్థిక సర్వేలో గణాంకాలలో సహా ఇచ్చి ఏకంగా గవర్నర్ తో అసెంబ్లీలో చదివించారన్నారు.
దీనిపై మాజీ సీఎం తాడేపల్లి నుంచి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ లపై మండిపడ్డారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ ను కార్పోరేటర్ కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ సెటైర్ లు వేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైసీపీ, జనసేనల మధ్య వివాదాన్ని రాజేశాయి. ఈ క్రమంలో దీనిపై ఏపీజనసేన పార్టీకి చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ రియాక్ట్ అయ్యారు.
Work from home MLA - @ysjagan#YCPCricketTeam pic.twitter.com/TAuU936KRf
— JanaSena Shatagni (@JSPShatagniTeam) March 5, 2025
ప్రజలు వైఎస్ జగన్ ను ఛీదరించుకున్నారన్నారు. వైనాట్ 175 అన్న జగన్ కు .. కేవలం ప్రజలు11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారన్నారు. దీంతో జగన్ కు పూర్తిగా మతి భ్రమించి ఫ్రస్టేషన్ తో ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. అసెంబ్లీకి వచ్చి ప్రజల గొంతుక విన్పించాల్సింది పోయి.. మీడియా సమావేశాలు నిర్వహిస్తు ఏదో ఒకటి కాంట్రవర్సీలకు కారణమౌతున్నారని విమర్శించారు.
జగన్‍లాగా తాము ఆరోపణలు చేయగలమని.. కానీ సభ్యత అడ్డువచ్చి ఊరుకుంటున్నామన్నారు. జగన్ .. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తు.. తాము కూడా.. జగన్ ను.. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అని తామూ అనగలమని.. కానీ సభ్యత ఉంది కనుక ఆలోచిస్తున్నామంటూ కౌంటరిచ్చారు.
మాజీ సీఎం జగన్.. వైఎస్ జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు ఎమ్మెల్యే అంటూ నాదెండ్ల మనోహర్ తీవ్రస్థాయిలో పంచ్ లు వేశారు. నోరు ఉంది కదా.. అని ఏది పడితే అది మాట్లాడితే వదిలేది లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేనల మధ్య వార్ ఒక రేంజ్ లో కొనసాగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









