)
AP govt announces financial assistance for kasibugga stampede victims: ఆంధ్ర ప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గలో ఏకాదశి వేళ పెనువిషాదం చోటుచేసుకుంది . శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొవడానికి వచ్చిన భక్తుల్లో ఏకంగా 10 మంది దుర్మరణం చెందారు. మరో 10 మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రధాని మోదీ కేంద్రం నుంచి ఆపన్నహస్తం అందించారు. తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు.ఈ క్రమంలో మంత్రి నారాలోకేష్ కాశీబుగ్గ ఘటనప్రదేశాన్ని వెళ్లి చూశారు. బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 10 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది.
మృతుల కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సాయం, పాక్షికంగా గాయపడ్డ వారికి రూ. 50 వేలు అందిస్తామని మంత్రి నారాలోకేష్ ప్రకటించారు. ఈ ఘటన ఎంతగానో కలిచి వేసిందన్నారు. గాయపడ్డవారు తొందరా కొలుకొవాలని ఆదేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు.
మరోవైపు.. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని, గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.