)
Minister nara Lokesh fires on former cm ys jagan: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు ప్రస్తుతం మరింత హాట్ గా మారాయి. ఇప్పటికే జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో జరిగిన ప్రమాదాల ఘటనలపై ఆయనపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు.. జగన్ ఇటీవల పుష్ప2 సినిమాలోని కాంట్రవర్సీ డైలాగ్ వ్యాఖ్యలు చేయడం కూడా పెద్ద వివాదంను రాజేశాయి. ఈ క్రమంలో మంత్రి నారాలోకేష్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి నారా లోకేష్.. కృష్ణా జిల్లా మచిలీపట్నం చేరుకున్నారు. నారాలోకేష్ కు.. మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాశ్, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, శాసనసభ్యులు బోడె ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్‌లతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ క్రమంలో అక్కడి ప్రజలతో మాట్లాడారు.
మహిళలు తమ పిల్లల చదువు కోసం ఎలాంటి కష్టాలు పడొద్దని.. తల్లికి వందనం పథకం తీసుకొచ్చామన్నారు. అదే విధంగా.. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పలు డెవలప్ మెంట్ పథకాలను గురించి కూడా లోకేష్ తెలిపారు. మహిళలకు కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం.. మహిళలను కించపరిచే విధంగా నేతలు మాట్లాడారని గుర్తు చేశారు.
సమాజంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మహిళలతో మాట్లాడే తీరులో మార్పు రావాలని మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ అనే పేరు వింటేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. సమాజంలో మార్పులు, చట్టాలతోనే.. డబ్బులు పంచడంతోనే రాదన్నారు. ప్రతి ఒక్కరిలో కూడా మంచి నడవడిక అలవాటు కావాలన్నారు. అన్ని పాఠశాలలో కూడా.. పెరెంట్స్, ఉపాధ్యాయులతో మీటింగ్ లు నిర్వహిస్తామని వెల్లడించారు.
తన సతీమణి బ్రాహ్మణి సహకారంతో రాజకీయాల్లో, ప్రజలకు సేవలు చేయడంలో విజయవంతంగా రాణిస్తున్నానని లోకేశ్ అన్నారు. మరోవైపు తన తల్లి భువనేశ్వరి ఏవిధంగా .. రాష్ట్రానికి సేవలు చేయడంలో తోడ్పాటు అందిస్తుందో.. బ్రాహ్మణి సైతం తనకు నిరంతరం సలహాలు, సూచనలు చేస్తు అన్ని విధాలుగా సహాకారం అందిస్తుందని మంత్రి నారాలోకేష్ తన సతీమణిపై ప్రశంసలు కురిపించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.