Nara Lokesh Video: నారా లోకేష్ చేతిలో ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. ఎక్కడ నెగ్గాలో కాదూ.. ఎక్కడ తగ్గాలో చూపెట్టిన ఏపీ మంత్రి.. వీడియో వైరల్..

Nara Lokesh holds jr ntr flexi: ఏపీ మంత్రి నారా లోకేష్ తాజాగా గన్నవరంలో మల్లవల్లి ఇండస్ట్రీయల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంకు హజరయ్యారు.ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 20, 2025, 07:50 PM IST
  • గొప్పమనసు చాటుకున్న నారాలోకేష్..
  • సంబరాల్లో టీడీపీ అభిమానులు..
Nara Lokesh Video: నారా లోకేష్ చేతిలో ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. ఎక్కడ నెగ్గాలో కాదూ.. ఎక్కడ తగ్గాలో చూపెట్టిన ఏపీ మంత్రి.. వీడియో వైరల్..

Minister nara Lokesh holds junior ntr flexi video: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి సర్కారు ప్రజలకు మెరుగైన పాలన అందించే క్రమంగా దూసుకుపోతుంది. అయితే.. చంద్రబాబు కుటుంబానికి, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య గ్యాప్ ఉందని అనేక సందర్భాలలో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో గతంలో పలుకార్యక్రమాలలో కూడా జూనియర్ ఎన్టీఆర్ కూడా పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారు.

Add Zee News as a Preferred Source

అయితే.. చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఏదో కోల్డ్ వార్ మాత్రం అంతర్గతంగా నడుస్తుందని కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్..  గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.  అక్కడ అభిమానులు, కార్యకర్తలు మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.

 

ఈ క్రమంలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని అక్కడ కొందరు ఏర్పాటు చేశారు. మంత్రి నారాలోకేష్ ఆ ఫ్లెక్సీని తన చేతిలో తీసుకుని అభిమానులకు చూపిస్తు.. వాళ్లను ఉత్సహపరిచారు. ఈ ఘటనతో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ ఒక్కపనితో.. నారా లోకేష్ .. తమకు, జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య దూరం ఉందని చేస్తున్న ప్రచారంకు చెక్ పెట్టారని కూడా సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి.

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ కూటమిలోకి వస్తే.. చంద్రబాబుకు.. అగ్నికి, గాలితోడైనట్లు అని నెటిజన్లు అంటున్నారు. మరోవైపు మంత్రి నారాలోకేష్ ను సైతం ఎక్కడ నెగ్గాలో కాదూ.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన లీడర్ అంటూ.. మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more:  Tirumala News: తిరుమల క్యూలైన్ లో షాకింగ్ ఘటన.. తలలు పగిలేలా కొట్టుకున్న భక్తులు.. ఏమైందంటే..?  

మొత్తంగా ఈ పరిణామం మాత్రం ఏపీలో కొత్త చర్చకు దారితీసిందని చెప్పుకొవచ్చు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ ఒక మైలురాయగా నారాలోకేష్ అభివర్ణించారు.  ఈ ప్లాంట్ ద్వారా తొలి దశలో 600 మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. రెండో దశలో మరో 1200మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి వెల్లడించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News