Minister Nara Lokesh: వైసీపీ సభ్యులు పారిపోతున్నారు.. మార్షల్స్‌ను పెట్టి సభకు తీసుకురండి: నారా లోకేష్‌

AP Assembly Sessions 2025: సభ నుంచి వాకౌట్ చేయడంతో వైసీపీ సభ్యులపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేసి.. ఇప్పుడు సభ నుంచి పారిపోతున్నారని అన్నారు. మార్షల్స్‌ను పెట్టి సభ నుంచి బయటకు వెళ్లిన సభ్యులను లోపలికి తీసుకురావాలని ఛైర్మన్‌ను కోరారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 17, 2025, 04:22 PM IST
Minister Nara Lokesh: వైసీపీ సభ్యులు పారిపోతున్నారు.. మార్షల్స్‌ను పెట్టి సభకు తీసుకురండి: నారా లోకేష్‌

AP Assembly Sessions 2025: వైసీపీ హయాంలో టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు ఆ అంశంపై చర్చలో పాల్గొనకుండా ఆరోపణలు చేసి పారిపోతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. శాసనమండలిలో 2019-24 మధ్య అవినీతి, అక్రమాలపై చర్చను నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. అజెండా బీఏసీ నిర్ణయిస్తుంది. అందరూ చర్చించి నిర్ణయం తీసుకున్నారు. 2019-24 మధ్య జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాల అంశంపై చర్చకు అనుమతిస్తూ మండలి ఛైర్మన్ ఆదేశాలు జారీచేశారు. బీఏసీలో వైసీపీ సభ్యులు అంగీకరించారు. చర్చలో వైసీపీ సభ్యులు 2014-19 మధ్య జరిగిన పాలనపై ఆరోపణలు చేసి.. ఇప్పుడు సమాధానం ఇస్తుండగా వాకౌట్ చేస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

"వైసీపీ సభ్యులు ఆరోపణలు చేసి పారిపోతారు. సమాధానానికి సమయం ఇవ్వరు. మేం సమాధానం ఇచ్చే సమయంలో సభలో ఉండరు. ఇది మొదటిసారి కాదు.. పదేపదే ఈ విధంగా చేస్తున్నారు. ఇది సరికాదు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో మార్షల్స్‌ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి. ఇప్పుడు మార్షల్స్‌ను పెట్టి బయట ఉన్న సభ్యులను సభకు తీసుకురావాలి. ఆ అధికారం ఛైర్మన్‌కు ఉంది. 2014-19 మధ్య పాలనపై వైసీపీ సభ్యులు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కేసులు పెట్టారో చూశాం. చేయని తప్పునకు చంద్రబాబు గారిని 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. 

మొదట రూ.3 వేల కోట్ల కుంభకోణం అన్నారు. తర్వాత రూ.300 కోట్లని, తర్వాత రూ.27 కోట్లు అని అన్నారు. చేయని తప్పునకు జైలుకు పంపారు. అచ్చెన్నాయుడు గారిని, ధూళిపాళ్ల నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని.. అందరినీ ఇబ్బంది పెట్టారు. చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ బయటపడతాయని భయపడుతున్నారా..? ఆరోపణలు చేసి పారిపోతున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. మా నాయకులు చేయని తప్పులకు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపేందుకు యత్నించారు. కేసులపై చర్చించాలి. నాపైనా 23 కేసులు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. హత్నాయత్నం కేసు పెట్టారు. చర్చకు లేకుండా పారిపోయారు. ఇది సరికాదన్నారు. మార్షల్స్ ను పెట్టి బయటకు వెళ్లిన వైసీపీ సభ్యులను లోపలికి తీసుకురావాలి" అని ఛైర్మన్‌ను నారా లోకేష్‌ కోరారు.  

Also Read: Ar Rahman: ఏఆర్ రెహమాన్ ఇప్పటికి నా భర్తే.. ఎమోషనల్ అయిన సైరా భాను.. స్టోరీ ఏంటంటే..?  

 Also Read: Shani dev Effect: శని కుబేర యోగంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. వీరి జీవితాల్లో అష్టైశ్వార్యాలే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News