
Nara Lokesh satires on former cm ys jagan over vip passes culture in pulivendula: సాధారణంగా మంత్రులు, ఎంపీలు మొదలైన రాజకీయ నేతలు వీఐపీ ప్రొటొకాల్ భద్రతలో ఉంటారు. వీరిని కలవాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకొవాల్సి ఉంటుంది. అయితే.. మనం తరచుగా వీఐపీ పాస్ లను గురించి వింటు ఉంటాం. ఆలయాల్లో, ప్రత్యేకంగా ఉన్న ప్రదేశాల్లో వెళ్లేందుకు అనుమతుల కోసం వీఐపీ పాస్ లను జారీ చేస్తారు. దీంతో ఆ నేతల్ని ఈజీగా కలవొచ్చు .
ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.... సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా? ఎప్పుడూ వినలే..! చూడలే..! @ysjagan pic.twitter.com/0jGiccnL5A
— Lokesh Nara (@naralokesh) September 2, 2025
కానీ ఇక్కడ మాత్రం ఒక ఎమ్మెల్యే తనను నియోజక వర్గ ప్రజలు కలవాలంటే కూడా వీఐపీ పాస్ లను కల్గి ఉండాలని ఆ పార్టీ నేతలు జారీ చేయడం ప్రస్తుతం పెద్ద రచ్చగా మారింది. ప్రస్తుతం మాజీ సీఎం జగన్ నియోజక వర్గమైన పులివెందులలో స్థానిక ప్రజలు ఆయన్ను కలవాలంటే... వీఐపీ పాస్ లు తప్పనిసరి అంటూ ఆ పార్టీ వీఐపీ పాస్ లను జారీ చేసింది.
ఇది ప్రస్తుతం పెద్ద రచ్చగా మారింది. తాము ఎన్నుకున్న నేతను కలిసేందుకు, తమ సమస్యల్ని చెప్పుకొవాలంటే.. వీఐపీ పాస్ లు ఏంటని కొంత మంది తలలు పట్టుకుంటున్నారు. ఈక్రమంలో మంత్రి నారాలోకేష్ తాజాగా.. దీనిపై ఆసక్తి కర ట్విట్ చేశారు. ఇప్పటి వరకు షాపులు, ఆలయాలు మొదలైన చోట్ల వీఐపీ పాస్ లు చూశాం కానీ.. నేతల్ని కలవడానికి ప్రజలకు వీఐపీ పాస్ లు ఏంటని సెటైరిక్ ట్విట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
'ఓరి నీ పాసుగాల!.. సినిమా ఫంక్షన్లకు VIP పాసులు విన్నాం గానీ.. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలను కలవడానికి VIP పాసులు ఏందయ్యా?.. ఎప్పుడూ వినలే..! చూడలే..! వైఎస్ జగన్ అంటూ మంత్రి నారా లోకేష్ పంచ్ లు వేస్తు ట్వీట్ చేశారు.
ఇది మరీ విడ్డూరంగా ఉందని కూడా నారాలోకేష్ ఎద్దేవా చేశారు. మరోవైపు వైఎస్ జగన్.. తన తండ్రి వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జగన్ పులివెందుల వచ్చారు. అంతే కాకుండా.. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో కూడా స్థానిక నేతలతో పలు విషయాలపై సమాలోచనల్లో జగన్ బిజీగా ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.