MLA MLC Sports Event: ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు బ్యాట్ బంతి పట్టారు. రాజకీయాల్లో.. అసెంబ్లీలో యుద్ధం ప్రకటించే ప్రజాప్రతినిధులు మైదానంలో బస్తీ మే సవాల్ అంటున్నారు. నువ్వా నేనా అంటూ మాటలతో కాకుండా ఆటతో సవాల్ చేసుకుంటున్నారు. ఇక మహిళా ప్రజాప్రతినిధులు తమదైన ఆటలతో సందడి చేశారు. నిత్యం రాజకీయాలు, పాలనలో బిజీ ఉండే ప్రజాప్రతినిధులు మూడు రోజుల పాటు క్రీడల్లో మునిగి తేలుతున్నారు.
Also Read: Movie Theatre: హీరో నానికి బిగ్ షాక్.. థియేటర్‌లో 'కోర్టు' సినిమా నిలిపివేత!
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించారు. స్పీకర్ అయ్యనపాత్రుడు మంగళవారం విజయవాడలోని మున్సిపల్ మైదానంలో క్రీడా పోటీలను ప్రారంభించారు. టాస్ వేసి క్రికెట్ పోటీని ప్రారంభించిన అనంతరం స్పీకర్ కొద్దిసేపు బ్యాటింగ్ చేశారు. పిచ్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యాట్ బాల్ పట్టుకుని క్రికెట్ ఆడారు. మహిళలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. మూడ్రోజులపాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందడి చేశారు.
Also Read: CLAP Programme: మరో జగన్ పథకం ఎత్తివేత? కాకినాడలో నిరుపయోగంగా క్లాప్ వాహనాలు
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులకు నిర్వహించే ఆటలు కొత్త సంప్రదాయం కాదు.. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 'ఎన్టీఆర్ హయాంలో క్రీడా పోటీలు నిర్వహించేవారు. అప్పట్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు జరిగేవి. రవీంద్రభారతిలో నిర్వహించిన సాంస్కృతిక పోటీల్లో నేను కూడా ఎమ్మెల్యేనే కదా నాకు అవకాశం ఇవ్వండి అని ఎన్టీఆర్‌ని అడిగాను. పోటీలో పాల్గొంటానని చెప్పి దానవీరశూర కర్ణ ఏకపాత్రాభినయాన్ని ప్రదర్శించి అవార్డు దక్కించుకున్నా' అంటూ స్పీకర్ అయ్యనపాత్రుడు గుర్తు చేసుకున్నారు.
కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుండడంతో వారికి ఆటవిడుపుగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. 'మూడురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొనాలి. రాష్ట్రంలో చాలా మంది యువ క్రీడాకారులు ఉన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, ఆటలకు పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం' అని స్పీకర్ అయ్యనపాత్రుడు చెప్పారు. క్రీడా పోటీల అనంతరం ఈనెల 20వ తేదీన సాంస్కృతిక కార్యక్రమాలు జరగనుండగా.. అందరూ ఎమ్మెల్యేలు పాల్గొనాలని స్పీకర్ సూచించారు.
హోంమంత్రి ఓటమి
క్రీడా పోటీల్లో హోంమంత్రి వంగలపూడి అనిత ఘోరంగా ఓడిపోయారు. ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ ఆట రసవత్తరంగా సాగింది. పంచుమర్తి అనురాధ జట్టు చేతిలో వంగలపూడి అనిత బృందం చిత్తుగా ఓడిపోయింది. ఆసక్తికరంగా జరిగిన ఈ పోటీలో హోం మంత్రి టీమ్ ఓడిపోయిన ఈ మ్యాచ్ వీడియో వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









