Mla Nandamuri Balakrishna interesting comments on hindupuram constituency: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హిందూపురం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల హిందూపురంలో వైఎస్సార్సీపీ పార్టీ ఆఫీస్ పై బాలకృష్ణ అభిమానులు, టీడీపీ ఫాలోవర్స్ దాడులు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో దీనిపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ఇలాంటి పనులు ప్రజాస్వామ్యంను అభాసుపాలు చేస్తాయన్నారు. మొత్తంగా ఈ ఘటనపై వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. బాలకృష్ణ, ఏపీ సీఎం చంద్రబాబు వెనకుండి ఇవన్ని చేయిస్తున్నారని మండిపడులున్నారు.
ఈ క్రమంలో తాజాగా.. ఎమ్మెల్యే నందమూరీ బాలకృష్ణ హిందూపురం పర్యటించారు. నియోజక వర్గంలో పలు డెవలప్ మెంట్ పనులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా హిందూపురం నియోజక వర్గం ప్రజలకు ఎల్లవేళల రుణపడి ఉంటామన్నారు. తన తండ్రిని, అన్నను, తనను హిందూపురం ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు. నియోజక వర్గం డెవలప్ మెంట్ కోసం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామన్నారు.
ఇవాళ(ఆదివారం) హిందూపురం మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు బాలకృష్ణ శంకుస్థాపనలు చేశారు. రెండో రోజు హిందూపురం పర్యటనలో.. బాలకృష్ణ మాట్లాడుతూ... హిందూపురంలో తనను మూడుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. హిందూపురం ప్రాంతంలో కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతీ, యువకులను ఆదుకుంటామన్నారు.
హిందూపురం మండలం మలుగూరులో రూ.26.5 లక్షల వ్యయంతో నిర్మించిన పశువుల ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించారు. దీనితో పాటు వాల్మీకి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. మున్సిపాలిటీలో రహదారులు, డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించి బాలాజీ సర్కిల్‌లో పైలాన్ ఆవిష్కరించారు. ముద్దిరెడ్డిపల్లిలో చౌడేశ్వరి కల్యాణ మండపంలో హ్యాండ్ లుమ్స్, టెక్స్‌టైల్స్ వారి ఆధ్వర్యంలో సబ్సిడీ కింద మంజూరైన చేనేత పరికరాలను పంపిణీ చేశారు.
Read more: Hindupuram Attack news: బాలకృష్ణ ఇదా నీ రాజకీయం.!.హిందూపురం ఘటనపై వైసీపీ నేతలు సీరియస్.. వీడియో..
దీనితోపాటు సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణచేశారు. ఈక్రమంలో హిందు పురంను అన్నివిధాలుగా ఒక రోల్ మోడల్ గా ముందుకు తీసుకెళ్తామని , దీనిపై మంత్రులు కూడా ప్రత్యేకంగా చొరవ చూపే విధంగా కోరతానని కూడా బాలకృష్ణ తన నియోజక వర్గం ప్రజలకు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









