)
Balakrishna sensational comments on ys jagan and Chiranjeevi video: ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఒకవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న డెవలప్ మెంట్ పనుల గురించి చర్చిస్తున్నారు. మరోవైపు గత ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వం ప్రజలకు తెలిసేలా చేస్తుంది.
అయితే.. అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాకుండా, వారి ఎమ్మెల్యేలను పంపకుండా .. కేవలం రోజు రెండు ప్రశ్నల్ని చర్చించాలని జగన్ లేఖను పంపడం ఎంత వరకు సమంజసం అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలోఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఆసక్తి కర ఘటన చోటు చేసుకుంది. హిందుపురం ఎమ్మెల్యే నందమూరీ బాలకృష్ణ కూటమి సర్కారుపై , అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస రావుపై మండిపడ్డారు.
అసెంబ్లీలో కామినేనిపై సీరియస్ అయినా ఎమ్మెల్యే బాలకృష్ణ
చిరంజీవిని కలిసేందుకు #YSJagan ఇష్టపడలేదన్న కామినేని#Chiranjeevi గట్టిగా అడిగితే జగన్ దిగివచ్చారన్నది అబద్ధం
ఎవరూ గట్టిగా అడగలేదన్న బాలకృష్ణ pic.twitter.com/NrClNYMJLi
— greatandhra (@greatandhranews) September 25, 2025
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. గత కూటమి హయాంలో.. సినిమా సెలబ్రిటీలు వైఎస్ జగన్ ఇంటికి వెళ్లిన సమయంలో అవమానించిన విషయాన్ని చర్చించారు. ఆ సమయంలో జగన్.. సెలబ్రీటీలతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదని, సినిమాటో గ్రఫి మంత్రితో మాట్లాడాలని అన్నారని శ్రీనివాస్ రావు చెప్పారు. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి కల్గజేసుకుని గట్టిగా మాట్లాడటంతోనే.. జగన్ సినిమా వాళ్లకు సమయం కేటాయించారన్నారు.
అయితే.. ఈ వ్యాఖ్యల్ని బాలయ్య ఖండించారు. చిరంజీవి గట్టిగా అడిగితే.. ఈయన వచ్చారా..? అంత సీన్ లేదన్నట్లు బాలయ్య మెగాస్టార్ పై పంచ్ లు వేసినట్లు మాట్లాడారు. ఇది పూర్తిగా అవాస్తవమన్నారు. జగన్ ను సైకో అంటూ ఏకీపారేశారు. అంతటితో ఆగకుండా.. ఇటీవల ఈ ప్రభుత్వంలో కూడా ఫిల్మ్ డెవలప్మెండ్ కార్పోరేషన్ మీటింగ్ సమయంలో కూడా.. తనపేరును 9 స్థానంలో పెట్టి అవమానించినట్లు బాలయ్య అసెంబ్లీలో వాపోయారు.
ఆ విషయాన్ని వెంటనే సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్‌కు కి చెప్పానని కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాలయ్య అసెంబ్లీలో మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై ఇటు రాజకీయాల్లో, అటు టాలీవుడ్ లోను హట్ టాపిక్ గా మారింది. బాలయ్య మరోసారి చిరుకు పంచ్ లు వేశారని నెట్టింట చిరు, బాలయ్య ఫ్యాన్స్ ల మధ్య రచ్చ నడుస్తొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.