)
Mohan babu University Issue: నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయన నిర్వహిస్తున్న యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని AP ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఉన్నత విద్యా కమిషన్.గత మూడేళ్ల నుంచి విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో రూ. 26 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మోహన్ బాబు యూనివర్సిటీపై విచారణ జరిపిన ఉన్నత విద్యా కమిషన్. ఆరోపణలు నిజమేనని తేల్చింది. ఈ క్రమంలోనే మోహన్ బాబు యూనివర్సిటీకి రూ. 15 లక్షల రూపాయల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ. 26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రూ 15 లక్షలు జరిమానాని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించింది. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది ఉన్నత విద్యా కమిషన్.
అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కేవలం మోహన్ బాబుకు చెందిన విద్యాసంస్థలే కాదు.. ఏపీ మంత్రి నారాయణతో పాటు లోకేష్ తోడల్లుడు బాలయ్య చిన్నల్లుడకు చెందిన గీతం యూనివర్సిటీతో పాటు పలు విద్యా సంస్థల అధిపతులు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. గతంలో ఆయా విద్యా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించిన సందర్భాలున్నాయి. ఏపీలో ప్రభుత్వంలో ఉన్న వారు ఏం చేసినా.. చూసి చూడనట్టు ఉన్నత విద్యా మండలి వ్యవహరిస్తున్నట్టు కొంత మంది సోషల్ మీడియా వేదికగ ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని మోహన్ బాబు గతంలో కొన్ని విమర్శలు చేసిన సంగతి తెలిసిందే కదా.
అవన్ని మనసులో పెట్టుకొని మోహన్ బాబుకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశ్యంతో ఆయనకు సంబంధించిన విద్యా సంస్థలపై కూటమి ప్రభుత్వం దాడులు నిర్వహించిదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు మోహన్ బాబు బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీతో మంచి సత్సంబంధాలున్నాయి. కానీ చంద్రబాబును కాదని మోహన్ బాబుకు మోడీగా అండగా నిలబడతారా అనేది డౌటే. మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీలో నిజంగానే అక్రమాలు జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది కేవలం మోహన్ బాబకు చెందిన విద్యా సంస్థలకే పరిమితం కాకుండా.. ఏపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణతో పాటు .. బాలయ్య చిన్నల్లుడు విశాఖ పట్నం ఎంపీ శ్రీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీలో జరిగే అక్రమాలపై కూడా సరైన చర్యలను కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.