వేసవి నుంచి ఉపశమనం ; రుతు పవనాల ఘడియలు ఇవే..

వేసవి నుంచి ఉపశమనం ;  రుతుపవనాల ఘడియలు ఇవే..

Updated: May 14, 2019, 07:43 PM IST
వేసవి నుంచి ఉపశమనం ; రుతు పవనాల ఘడియలు ఇవే..

మండుటెండల నుంచి ఉపశమనం పొందేందకు రుతుపవనాలు  కోసం ఎదురుచూస్తున్నారు కదూ..అయితే ఈ ఘడియలు మరి కొన్ని రోజుల్లో మీ ముందుకు రానున్నాయి. వచ్చే నెల 4న కేరళకు రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. ఇలా కేరళ తీరం నుంచి  జూలై మధ్యలో దేశమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

గతంలో పోల్చితే తక్కువ వర్షపాతం

వాస్తవానికి గత ఏడాదితో పాల్చితే ఈ సారి కొంచెం ఆలస్యంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా గత ఏడాది కంటే ఈ సారి  తక్కువ వర్షపాతం నమోదవనుందని వాతావరణశాఖ అంచానా వేస్తోంది. దేశ దీర్ఘకాల సగటులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Tags: