AP Rajya Sabha: ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు మందకృష్ణ మాదిగ.. ?

AP Rajya Sabha: ఆంధ్ర ప్రదేశ్ లో విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై కూటమి నేతల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఈ సీటును తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్.. ఐపీఎస్ సింగం అన్నామలైకు ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ సీటును ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకు ఇవ్వనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 23, 2025, 12:30 PM IST
AP Rajya Sabha: ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు మందకృష్ణ మాదిగ.. ?

AP Rajya Sabha: AP  ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఎవరికి  దక్కుతుందన్న  విషయంపై పెద్ద చర్చే నడుస్తోంది.  బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి   అమిత్‌ షాతో , ఏపీ సీఎం చంద్రబాబు  నిన్న ఢిల్లీ  పర్యటనలో  ఈ విషయమై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా  ఆ  సీటును తమకు ఇవ్వాలని బీజేపీ కోరినట్టు సమాచారం.

Add Zee News as a Preferred Source

ఆ  స్థానం నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు సింగం మాజీ ఐపీఎస్  అన్నామలై కు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా వుండగా నిన్న ఆసక్తికర  పరిణామం చోటు చేసుకుంది.  MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అటు అమిత్‌ షాతో, ఇటు చంద్రబాబుతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

రెండు  తెలుగు రాష్ట్రాల్లో  SC వర్గీకరణ చట్టం అమలు అయిన నేపథ్యంలో మంద కృష్ణ మాదిగకు ఆ స్థానం దక్కనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఇప్పుడు జరగబోయే రాజ్యసభ స్థానం ఎన్నికకు BJP నుంచి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు  అన్నామలై, మంద కృష్ణమాదిగ పేర్లు పరిశీలనలో వున్నట్టు ఉహాగానాలు ఊపందుకున్నాయి. రీసెంట్ గా మందకృష్ణ మాదిగను కేంద్రం గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా పద్మ శ్రీ అవార్డుతో గౌరవించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటు ఈయనకే దక్కే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News