Wedding Postpone Kills Bride Life: సంబంధం కుదిరింది.. అబ్బాయి గుణవంతుడు.. స్థితిమంతుడు ఇక పందిరి మండపంలో తాళి కట్టించుకోవడమే. ఎన్నో ఆశలతో అతడితో కొత్త జీవితం ప్రారంభిద్దామనుకుంటే ఊహించని స్థితిలో గండాలు ఎదురవుతున్నాయి. ముహూర్తం పెట్టుకుని పెళ్లికి సిద్ధమవుతుంటే వాయిదాల మీద పడుతున్నాయి. ఇరువురి కుటుంబంలో ఎవరో ఒకరు వరుసగా మరణిస్తున్నారు. అంటు (మైల) ఉంటుండడంతో పెళ్లిని కుటుంబసభ్యులు వాయిదా వేస్తున్నారు. చివరికి పెళ్లి చేద్దామనుకుంటే మరోసారి వాయిదా పడడంతో ఆ యువతికి చిర్రెత్తుకు వచ్చింది. వరుసగా పెళ్లి వాయిదాతో మనస్తాపం చెంది ఇక తనకు పెళ్లి యోగం లేదని భావించి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: DGMOs Meeting: యుద్ధానికి ముగింపు పలుకుతారా? రేపు పాక్, భారత్ డీజీఎంఓల భేటీలో ఏం జరగనుంది?
అనంతపురం జిల్లాలోని గుంతకల్లు ఎస్సై గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లూరు గ్రామానికి చెందిన మస్తానయ్య, సుశీలమ్మ దంపతులకు కుమార్తె లక్ష్మీనరసమ్మ (23) ఉంది. వీరు కుటుంబంతో సహా బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీనరసమ్మకు గుంతకల్లు మండలానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. కుటుంబ పెద్దలు వీరి పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించారు. అయితే పెళ్లి జరగాల్సిన సమయానికి బంధువుల్లో ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. విషాద సమయంలో పెళ్లి చేస్తే బాగుండదని కుటుంబసభ్యులు వివాహం వాయిదా వేస్తున్నారు.
Also Read: Mothers Day: మదర్స్ డే ట్వీట్ వైరల్.. పర్వాలేదు మాజీ సీఎం వైఎస్ జగన్‌కు 'అమ్మ' గుర్తు ఉంది
విషాదం నుంచి తేరుకోవడంతో ఈనెల 14, 15వ తేదీల్లో లక్ష్మీనరసమ్మ పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పత్రికలు పంచడంతోపాటు అన్ని పనులు పూర్తవడంతో లక్ష్మీనరసమ్మ తన వివాహం కాబోతుందనే ఆనందంలో ఉంది. వివాహం కోసం వారం కిందట బెంగళూరు నుంచి స్వగ్రామం ఇల్లూరుకు యువతి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు చేరుకున్నారు. వివాహ పనులు జోరుగా కొనసాగుతున్న సమయంలో అకస్మాత్తుగా కుటుంబంలో మరొకరు చనిపోయారు. దీంతో కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక చేసేదేమీ లేక మరోసారి పెళ్లి వాయిదా వేశారు.
ఈసారి కూడా వివాహం వాయిదా పడడంతో యువతి లక్ష్మీనరసమ్మ మనస్తాపానికి లోనయ్యింది. తనకు పెళ్లి యోగ్యం లేదని ఆందోళన చెందుతోంది. ఇక తనకు పెళ్లి కాదని నిర్ణయించుకుని ఇంట్లోనే శుక్రవారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇది చూసిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం లక్ష్మీనరసమ్మ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లికి చావు గండం ఉండడంతో చివరకు వధువు తనువు చాలించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter