JanaSena Party Jayaketana Sabha: ఎన్నికల్లో సీటు త్యాగం చేసి పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన త్యాగాన్ని కొట్టిపారేశారు. పవన్ కల్యాణ్ విజయానికి ఎవరైనా తాము సహకరించామని చెప్పుకోవడం అది వారి ఖర్మ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పిఠాపురంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపాయి.
Also Read: 4 Days Banks Close: 4 రోజులపాటు బ్యాంకులు బంద్? కారణం ఇదే!
జనసేన పార్టీ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో శుక్రవారం సాయంత్రం జయకేతన పేరిట ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి 2 అంశాలు పనిచేశాయి. అవి పవన్ కల్యాణ్, పిఠాపురం ప్రజలు. అయితే పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ' అని నాగబాబు వ్యాఖ్యానించారు. 'అంతకంటే ఏమీ చేయలేం' అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జ్ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను ఉద్దేశించే చెప్పారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Also Read: TGPSC Group 3 Results: తెలంగాణ గ్రూప్ -3 ఫలితాలు విడుదల.. టాప్ 10 ర్యాంకర్లు వీరే!
'నాయకులు ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అనే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో గతంలో చూశాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నాగేంద్ర బాబు పరోక్షంగా విమర్శలు చేశారు. 'నోటి దురుసుతో వ్యవహరించిన ఒక నాయకుడికి చివరకు ప్రతిపక్ష హోదా దక్కలేదు' అని తెలిపారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు సమాధానం ఇవ్వగలిగేలా మాట్లాడాలని చెబుతారు అని వివరించారు.
జనసేన పార్టీ జయకేతన సభ పేరిట నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ ఉత్సాహంగా సాగుతోంది. ఈ సందర్భంగా జనసేన పార్టీ 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రదర్శించారు. భవిష్యత్‌లో జనసేన పార్టీ సొంతంగా ఎదిగేలా ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగుదేశం పార్టీకి షాకిచ్చేలా జనసేన పార్టీ భవిష్యత్ ప్రణాళికలు రచిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









