Nagababu: ఇకపై పిఠాపురంలో చక్రం తిప్పనున్న నాగబాబు.. వర్మకు షాక్ ఇచ్చేలా జనసేన ప్లాన్..

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీతో పిఠాపురం రాజకీయాలు మారబోతున్నాయి. తాజాగా ఈయన ఏపీలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా ఒకే ఇంట్లో నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత ఏపీ శాసన మండలికి ఎన్నికైన నటుడిగా రికార్డు క్రియేట్ చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికైన నాగబాబు.. ఇకపై పవన్ కళ్యాణ్  ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురంలో చక్రం తిప్పనున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 3, 2025, 09:46 AM IST
Nagababu: ఇకపై పిఠాపురంలో చక్రం తిప్పనున్న నాగబాబు.. వర్మకు షాక్ ఇచ్చేలా జనసేన ప్లాన్..

Nagababu: పిఠాపురం రాజకీయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు పెత్తనమంతా నాగబాబు చేతిలోకి వెళ్లనుంది. ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణం చేయకముందే తొలి పర్యటనను పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టాలని ప్లాన్‌ చేశారు. నిన్న ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన నాగబాబు రెండు రోజులపాటు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన కార్యాలయం ప్రకటించింది.  అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా.. అటు ఏపీ రాజకీయాలతో పాటు కేంద్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గానికి ఓ ఇంఛార్జ్ గా నాగబాబు వ్యవహరించనున్నారు.

Add Zee News as a Preferred Source

ఈయన జనసేన లోకల్ రాజకీయాలతో పాటు పిఠాపురానికి సంబంధించిన బాధ్యతలు ఇకపై ఆయనే చూసుకోనున్నారు.  అంతేకాదు ఈ పర్యటనతో నాగబాబును పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మాజీ ఎమ్మెల్యే వర్మ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తొలి నుంచి వర్మను నాగబాబు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలోనూ పవన్‌ను తామే గెలిపించామనుకుంటున్న వారి ఖర్మ అంటూ వర్మను పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇక వర్మ పరిస్థితి ఏంటి... అన్న చర్చ సాగుతోంది.

తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు మరో రికార్డు క్రియేట్ చేసారు. ఒక ఇంటి నుంచి ముగ్గురు ప్రజానిధులుగా బాధ్యతలు వహించడం విశేషం. చిరంజీవి.. తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా.. కేంద్ర మంత్రిగా దివంగత మన్మోహన్ సింగ్ క్యాబినేట్ లో  పనిచేసారు. అటు పవన్ కళ్యాణ్ .. తొలిసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో పాటు చంద్రబాబు మంత్రి వర్గంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు నాగబాబు.. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. త్వరలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకే వేళ చేస్తే.. ఒకే ఇంట్లో ముగ్గురు  హీరోలు మంత్రులుగా  అయిన  ఘనత మన దేశంలో  కొణిదెల ఫ్యామిలీకే దక్కుతుంది.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News