close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఆ ఆరోపణలు నిరూపిస్తే ఆత్మహత్యకు సిద్ధమంటున్న నన్నపనేని !!

మహిళా ఎస్సైను కులంపేరుతో దూషించారని తనపై వస్తున్న ఆరోపణలపై టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి స్పందించారు

Updated: Sep 12, 2019, 12:11 AM IST
ఆ ఆరోపణలు నిరూపిస్తే ఆత్మహత్యకు సిద్ధమంటున్న నన్నపనేని !!

అమరావతి: విధి నిర్వహణలో ఉన్న ఓ మహిళా ఎస్సై కు కులం పేరిట దూషించారంటూ  టీడీపీ మహిళా నాయకులు నన్నపనేని రాజకీయకుమారిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల సత్యదూరమన్నారు. మహిళా ఎస్సై ను కించపరిచేలా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఇవన్నీ చవకబారు ఆరోపణలని...ఒక వేళ తాను మహిళా ఎస్సైని అవమానకరంగా మాట్లాడినట్టు నిరూపిస్తే ఆత్మహత్య చేసుకునేందుకు తాను సిద్ధమని  నన్నపనేని సంచలన వ్యాఖ్యలు చేశారు

'ఛలో ఆత్మకూరు' అరెస్టుల పర్వంలో భాగంగా చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారిని పోలీసులు అరెస్టు  చేశారు.  ఈ సందర్భంగా నన్నపనేని - పోలీసుల మధ్య వాగ్వాగం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో విధులను నిర్వర్తిస్తున్న ఓ మహిళ ఎస్సై నన్నపనేని చంద్రబాబు నివాసానికి వెళ్లకుండా అడ్డకునేందుకు యత్నించగా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నన్నపనేని తనను దూషించారని ఆరోపించిన ఓ మహిళా ఎస్‌ఐ ఈ విషయం ఉన్నతాధికారుల  ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.  ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలపై సన్నపనేని స్పందించారు