
Nara Lokesh Credit Bill: తన తల్లి నారా భువనేశ్వరి, తన భార్య నారా బ్రాహ్మాణి విషయమై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ లేకుంటే తాను.. తన తండ్రి సీఎం చంద్రబాబు లేరని ప్రకటించారు. తన తల్లి త్యాగం లేకుంటే చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయలేరని తెలిపారు. వారిద్దరి సహకారం ఉండడం వలనే రాజకీయాల్లో తాను, తన తండ్రి కొసాగుతున్నారని వెల్లడించారు. ప్రజలు కూడా మహిళలకు సహకరించాలని సూచించారు.
మచిలీపట్నంలో బుధవారం మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి నారా లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో నారా లోకేశ్ ఆసక్తికర ప్రసంగం చేశారు. 'మహిళలు అందరికీ రుణపడి ఉంటా. పిల్లలను చదివించేందుకు ఏ తల్లీ ఇబ్బంది పడకూడదని తల్లికి వందనం అమలు చేశాం' అని తెలిపారు. గతంలో మహిళలు కించ పరిచేలా మాట్లాడారో చూశారని.. కూటమి ప్రభుత్వంలో మహిళలను గౌరవించే స్థితి ఉంటుందని నారా లోకేశ్ వివరించారు. త్వరలో పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ పెడతామని ప్రకటించారు.
'సమాజంలో మార్పు రావాలి. మహిళతో మాట్లాడే విధానం మారాలి. చట్టాలతో.. డబ్బులతో ఆ మార్పు రాదు' అని నారా లోకేశ్ పేర్కొన్నారు. తనకు బ్రహ్మణికి చిన్న వయస్సులోనే పెళ్లి అయ్యిందని తెలిపారు. అమెరికాలో ఉన్నప్పుడు ఇంటి పనులు ఇద్దరం సమానంగా చేసే వాళ్లమని నారా లోకేశ్ చెప్పారు. బ్రహ్మణి సహకారం లేకపోతే తాను ఏం చేయలేనని.. దేవాన్ష్ బాధ్యతను బ్రాహ్మాణి చూసుకుంటోందని వివరించారు. ఇప్పటికీ తన క్రెడిట్ కార్డు బిల్లు బ్రాహ్మాణి కడుతుందని చెప్పి నవ్వులు పూయించారు.
'మా అమ్మ (నారా భువనేశ్వరి) త్యాగం చేయకపోతే చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయలేరు' అని నారా లోకేశ్ తెలిపారు. మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, వాసoశెట్టి సుభాష్ , ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగళ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook