Nara Lokesh Counter: 'అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే మాజీ సీఎం వైఎస్ జగన్'

Nara Lokesh Strong Counter To Ex CM YS Jagan Comments: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నారా లోకేశ్ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. అహంకారానికి ప్రతిరూపం వైఎస్‌ జగన్‌ అని ప్రతి విమర్శలు చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 5, 2025, 07:10 PM IST
Nara Lokesh Counter: 'అహంకారానికి ప్యాంట్, షర్ట్ వేస్తే మాజీ సీఎం వైఎస్ జగన్'

YS Jagan: 'అధికారంలో ఉన్నా.. కోల్పోయినా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు చేస్తారా? అహంకారానికి ప్యాంట్‌, షర్ట్‌ వేస్తే వైఎస్‌ జగన్‌ మాదిరి ఉంటుంది' అని నారా లోకేశ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌పై జగన్‌ దిగజారుడు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను ఉల్లంఘించి జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? అని ప్రశ్నించారు.

Add Zee News as a Preferred Source

Also Read: TTD Temples: ముఖ్యమంత్రులకు టీటీడీ లేఖలు.. ప్రతి రాజధానిలో శ్రీవారి ఆలయం

'కార్పొరేటర్‌కు ఎక్కువ. ఎమ్మెల్యేకు తక్కువ' అంటూ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్‌ స్పందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 'వైఎస్సార్‌సీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారు. ఆ విషయం జగన్‌కు అర్థం కావడం లేదు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి అడిగితే ఎలా?' అని నారా లోకేశ్‌ సందేహం వ్యక్తం చేశారు.

Also Read: APPSC Age Limit: నిరుద్యోగులకు సువర్ణావకాశం.. ఏపీపీఎస్సీ వయో పరిమితి పెంపు

ప్రతిపక్ష హోదా విషయంలో సీఎం చంద్రబాబును కించపరిచేలా మాట్లాడుతారా? అని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రతిపక్ష హోదా రావాలంటే 10 శాతం ఎమ్మెల్యేలు ఉండాలి. 11 సీట్ఉల ఎందుకు వచ్చాయో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదని వైఎస్‌ జగన్‌కు లోకేశ్‌ సూచించారు. ఈ సందర్భంగా జగన్‌ కుటుంబంలో విబేధాలపై లోకేశ్‌ స్పందిస్తూ.. 'తల్లి, చెల్లి కూడా నమ్మడం లేదని వైఎస్‌ జగన్‌ ఇంకా గ్రహించాలి' అని చెప్పారు.

'పవన్‌ కల్యాణ్‌కు వచ్చిన మెజారిటీ ఎంత? జగన్‌కు వచ్చింది ఎంత?' అని నారా లోకేశ్ ప్రశ్నించారు. 'జగన్‌ పాలనా విధ్వంసంతో ఆదాయం పడిపోయింది. గాడీ తప్పిన రాష్ట్రాన్ని సక్రమంగా పెడుతున్నాం' అని తెలిపారు. శాసనమండలిలో బొత్స సత్యనారాయణ చేస్తున్న ప్రసంగంపై నారా లోకేశ్‌ స్పందిస్తూ.. 'సజ్జల స్క్రిప్ట్‌ పంపిస్తుంటే మండలిలో అది చదవడం తప్ప బొత్స చేతుల్లో ఏముంది?' అని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News