టెస్త్ విద్యార్ధులకు విష్ చేసిన నారా లోకేష్

ఏపీలో ఈ రోజు విడదల చేసి టెన్త్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు

Updated: May 14, 2019, 04:00 PM IST
టెస్త్ విద్యార్ధులకు విష్ చేసిన నారా లోకేష్

పదో తరగతి ఫలితాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపారు. రికార్డుస్థాయిలో ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేసిన ఉఫాధ్యాయులకు,  పిల్లలకు ప్రోత్సహాన్ని అందించిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

ఏపీలో పదో తరగతి ఫలితాల్లో  94.88 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించగా  94.68 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఈ మేరకు స్పందించారు