Elephant Attack Issue: ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంచారంతో రైతులు ప్రాణాలు పోవడంతోపాటు పంట పొలాలు దెబ్బతినడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా పరిగణించారు. అటవీ ప్రాంతాల్లో సమస్య తీవ్రమవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండడంతో ఏనుగుల సంచారంపై పవన్ కల్యాణ్ అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. కొన్ని రోజులుగా ఏనుగుల సంచారంపై వరుస సమీక్షలు చేస్తున్న ఆయన తాజాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Also Read: Vizag: బెస్ట్ టూరిజం డెస్టినేషన్‌గా విశాఖపట్టణం తీర్చిదిద్దుతాం: చంద్రబాబు
అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న గ్రామాలలోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నయ్యే అవకాశాలు ఉంటే.. ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియను మరింత పెంచాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటన ఆయన దృష్టికి రావడంతో స్పందించారు. పీసీసీఎఫ్, సంబంధిత అధికారులతో గురువారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూనే బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశించారు.
Also Read: IT Companies: ఐటీ కంపెనీలకు కేరాఫ్ విశాఖ.. రేపు 4 కంపెనీలకు భూమిపూజ
తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగుల వలన ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపుతో మరణాలు సంభవిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు వివరించారు. రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తోందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వారికి ముందుగానే తెలియచేశామని పేర్కొన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ‘ఏనుగుల రాకను ముందే గుర్తించి ముందస్తు హెచ్చరికలను మరింత చేయండి. గ్రామాలవారీగా, రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజిలతోపాటు, వాయిస్ మెసేజిలు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుంది’ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









