new skink species like snake found in seshachalam forest: ప్రస్తుతం వానా కాలం నడుస్తోంది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఎర్లీగా రావడం వల్ల దేశమంతట కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం తూర్పు కనుమల్లో విస్తరించిన శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ రిజర్వ్ అడవిలో..ఒక పాములాంటి జీవి బైటపడింది.
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఒక అరుదైన, కొత్త జాతికి చెందిన స్కింక్ (నలికిరి) కి చెందిన జీవిగా చెప్తున్నారు. అయితే.. ఈ కొత్తగా గుర్తించిన ఈ స్కింక్ జాతికి డెక్కన్ గ్రాసైల్ స్కింక్.. అని సైంటిఫిక్ నామకరణం చేసినట్టు డాక్టర్ బెనర్జీ తెలిపారు. ఈ జీవి చూడటానికి అచ్చం పామును పోలి ఉంది. కానీ దీనికి కొంచెం కనురెప్పలు, శరీరంపై విభిన్నమైన చారలు ఉన్నాయని సైంటిస్టులు వివరించారు.
ప్రస్తుతం ఈ అరుదైన జీవి ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అటవీ ప్రాంతంతో పాటు, తెలంగాణలోని అమ్రాబాద్ అభయారణ్యంలో కన్పిస్తుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే ఈ జీవి మనుగడకు ఈ రెండు ప్రాంతాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
Read more: Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ..
అయితే ఈ జీవి గురించి పరిశోధనల్లో.. జెడ్ఎస్ఐకి చెందిన హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం, కోల్‌కతాలోని రెప్టిలియా విభాగం శాస్త్రవేత్తలతో పాటు లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన పరిశోధకులు పాల్గొన్నారని.. జెడ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్ దీపా జైస్వాల్ తన ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలొ తూర్పుకనుమల రిజర్వ్ అడవులు, ఆమ్రాబాద్ అడవుల్లో మరింత లోతుగా జీవవైవీధ్యం గురించి పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.









