YCP Plenary Meeting: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. ఇప్పటికే మంత్రుల బస్సు యాత్ర, ఇంటింటికి వైసీపీతో ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా పార్టీ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు షెడ్యూల్ విడుదలయ్యింది. సీఎం వైఎస్ జగన్‌ ఆదేశాలతో ప్లీనరీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. వచ్చే నెల 8,9 తేదీల్లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ప్రాంగణంలో ప్లీనరీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తీర్మానాలు చేయనున్నారు. ఈసందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్లీనరీ సన్నాహక సమావేశాల్లో భాగంగా అన్ని నియోజవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 23 నుంచి 28 వరకు వీటిని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలను ఈనెల 29,30, జులై 1వ తేదీల్లో ఏర్పాటు చేయనున్నారు. 


ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను తమకు పంపించాలని కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. జిల్లా స్థాయిలో చేసిన తీర్మానాలపై గుంటూరు ప్లీనరీ భేటీలో చర్చిస్తామని..అక్కడే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. 2019 ఎన్నికల ఫలితాలనే రిపీట్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Also read:Pooja Hegde: మైండ్ బ్లాకయ్యే షాక్ ఇచ్చిన నిర్మాతలు.. అస్సలు ఊచించి ఉండదు!


Also read:Agnipath: అగ్నిపథ్‌ ద్వారానే ఆర్మీ రిక్రూట్‌మెంట్..కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook