Amaravati Donation: రాజధాని అమరావతికి వృద్ధ మహిళ 4 బంగారు గాజులు విరాళం

Old Lady 4 Gold Bangles Donates For Capital Amaravati: అమరావతి రాజధాని నిర్మాణానికి ఓ వృద్ధురాలు తన ఒంటిపై ఉన్న బంగారు గాజులను విరాళం ఇచ్చారు. అంతేకాకుండా లక్ష రూపాయల నగదును అందజేశారు. ఆ మహిళను సీఎం చంద్రబాబు అభినందించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 24, 2025, 10:35 PM IST
Amaravati Donation: రాజధాని అమరావతికి వృద్ధ మహిళ 4 బంగారు గాజులు విరాళం

Gold Bangles Donation For Amaravati: విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ప్రకటించగా.. అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాలకు తోడు రాజధాని నిర్మాణానికి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వృద్ధురాలు తన చేతికి ఉన్న బంగారు గాజులను రాజధాని నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు. అంతేకాకుండా కొంత నగదును కూడా ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

Also Read: EPFO Big Gift: ఉద్యోగులకు ఈపీఎఫ్‌ఓ భారీ శుభవార్త.. లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు

రాజధాని అమరావతి నిర్మాణానికి ఇద్దరు మహిళలు విరాళం ఇచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలనే మంచి ఆలోచనతో కొంత సాయం అందించారు. ఏపీలోని తెనాలికి నన్నపనేని ఉదయలక్ష్మీ నాలుగు బంగారు గాజులు అందించారు. 36 గ్రాముల 546 మిల్లీగ్రాముల బంగారు గాజులను అమరావతిలోని సచివాలయంలో  మంగళవారం సీఎం చంద్రబాబును  కలిసి చంద్రబాబుకు అందించారు. బంగారు గాజులతో పాటు మరో రూ.1 లక్ష చెక్కును విరాళంగా బహుకరించారు. రాజధాని నిర్మాణానికి ఈ మొత్తాన్ని వెచ్చించాలని ఆమె విజ్ఞప్తి కోరారు. ఆమె అందించిన బంగారు గాజుల విలువ రూ.4 లక్షలు ఉంటుందని సమాచారం. ఇక వెలగపూడి చంద్రావతి రూ.50 వేలు విరాళం ఇచ్చారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. పెండింగ్‌ బిల్లులన్నీ క్లియర్‌

విరాళం అందించిన వృద్ధులైన ఆ ఇద్దరు మహిళలను సీఎం చంద్రబాబు అభినందించారు. రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి తెలిపారు. వీరి ఔదార్యం, ఉదారత ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజధాని నిర్మాణానికి వీరు స్ఫూర్తిగా నిలుస్తారని సీఎం అభినందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News