Sea Recedes Tension: సముద్రంలో అలజడులు.. ప్రశాంతత రెండింటిలో ఏది జరిగినా ఆందోళన కలిగించేదే. సముద్రుడు అప్పుడప్పుడు వెనక్కి వెళ్తుంటాడు. కానీ ఒకే నెలలో మూడు సార్లు వెనక్కి వెళ్లడం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని బంగాళాఖాతంలో ఇలాంటి పరిణామం చోటుచేసుకుంటుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ఫిబ్రవరి 11వ తేదీన మాఘమాసం పౌర్ణమి వేళ సముద్రం వెనక్కి వెళ్లింది. ఇప్పుడు మళ్లీ అమావాస్య తర్వాత సముద్రుడు వెనక్కి వెళ్లడంతో ఏపీలో కలకలం రేపుతోంది. వాస్తవంగా అమావాస్య సమయంలో సముద్రం వెనక్కి వెళ్లడం సహజమే! కానీ పౌర్ణమి రోజు వెనక్కి వెళ్లింది. ఇప్పుడు అమావాస్య తర్వాత వెనక్కి వెళ్లడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. ఎక్కడ? సముద్రం వెనక్కి వెళ్లిందో తెలుసుకుందాం.
Also Read: Magha Purnima: మాఘ పౌర్ణమి నాడు వెనక్కి వెళ్లిన 'సముద్రం'.. దేనికి సంకేతం?
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం ఉప్పాడ వద్ద సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజవర్గంలో ఏం జరిగినా సంచలనమే. తాజాగా ఇక్కడ సముద్రం నిత్యం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. నెల రోజుల వ్యవధిలో వరుసగా మూడుసార్లు సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. శుక్రవారం 30 మీటర్లు వెనక్కి వెళ్లడంతో ప్రతి ఒక్కరిలో ఆందోళన నెలకొంది.
Also Read: Inter Exams: రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. విద్యార్థులు ఇవి తెలుసుకున్నారా?
అమావాస్య సముద్ర స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా వారు సాధారణం కన్నా ఇంకా ఎక్కువ లోపలకు వెళ్లారు. సముద్రం వెనక్కి వెళ్లడంతో దూరం వెళ్లి అక్కడ నీటిలో స్నానాలు చేశారు. ఎప్పుడు వెనక్కి వెళ్లినా ఆందోళన అవసరం లేదని కానీ మూడుసార్లు ఇలా జరగడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. ఉప్పాడ గ్రామ శివారు పల్లెపేట, సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ శివారు వరకు సముద్రం వెనక్కి వెళ్లిపోయింది. సముద్రం వెనక్కి వెళ్లిన విషయాన్ని తెలుసుకుని గ్రామస్తులతోపాటు పరిసర గ్రామాల ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. సముద్రం వెనక్కి వెళ్లడంపై పండితులు, శాస్త్రవేత్తలు కూడా అవగాహన కల్పించాలని స్థానికులు, నాస్తికులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









