Tirupati: తిరుపతి వాసులకు కొత్త కష్టాలు-ఇళ్లకు బీటలు,భయాందోళనలో స్థానికులు
Cracks in houses in Tirupati: తిరుపతి వాసులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. పలు కాలనీల్లో ఇళ్లు కుంగిపోతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీకృష్ణా నగర్ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు వారాయి.
Cracks in houses in Tirupati: ఇటీవలి భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న తిరుపతి (Tirupati) వాసులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నగరంలోని పలు కాలనీల్లో ఇళ్లు కుంగిపోతున్నాయి. ఎంఆర్ పల్లిలోని శ్రీకృష్ణా నగర్ పరిధిలో సుమారు 18 ఇళ్లు బీటలు వారాయి. దీంతో ఆ ఇళ్లల్లో నివాసం ఉంటున్నవారు వాటిని ఖాళీ చేశారు. ఇళ్లు ఎందుకు బీటలు (Cracks in houses) వారుతున్నాయో తెలియక స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఇదే తిరుపతి (Tirupati) శ్రీకృష్ణానగర్‌లోని ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం భూమి లోపలి నుంచి నీళ్ల సంపు పైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటి మహిళ సంపును శుభ్రం చేస్తుండగా... ఒక్కసారిగా అది పైకి వచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్వీ యూనివర్సిటీ (SV University) జియాలజీ ప్రొఫెసర్స్ ఆ ఇంటిని సందర్శించారు. ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ... ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో ఇదే తొలిసారి అని అన్నారు. కాలువ గట్టున నిర్మాణం చేపట్టడం, ఇటీవలి వరద, తదితర కారణాలతో నీళ్ల సంపు 15 అడుగుల మేర పైకి వచ్చిందన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు తిరుపతిలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. చాలా చోట్ల రోడ్లు చెరువులను తలపించాయి. పలుచోట్ల బైకులు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. తిరుచానూరులోని వసుంధర నగర్‌లో ఓ ఇల్లు స్వర్ణముఖి నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ వర్ష బీభత్సం నుంచి తిరుపతి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. ఇంతలోనే చిత్తూరు జిల్లాకు మరోసారి భారీ వర్ష సూచన (AP Weather) అని వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: Bike On Fire In Adilabad: చలాన్లు వేస్తున్నారని నడిరోడ్డుపై బైక్ తగలబెట్టిన వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook