Paritala Sunitha: పరిటాల రవి హత్యలో వైఎస్‌ జగన్‌ పాత్ర కూడా ఉంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

Paritala Sunitha Sensation Allegations On YS Jagan: మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసుపై అతడి సతీమణి, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త హత్య కేసులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హస్తం ఉందని ప్రకటించడం తీవ్ర సంచలనం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 3, 2025, 02:16 PM IST
Paritala Sunitha: పరిటాల రవి హత్యలో వైఎస్‌ జగన్‌ పాత్ర కూడా ఉంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు

Paritala Ravi Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా ఉన్న పరిటాల రవి హత్యకు గురి కాగా ఆ హత్యపై కొన్ని దశాబ్దాల అనంతరం అతడి సతీమణి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త హత్యపై నోరు విప్పిన ఆమె ఆ కేసులో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి పాత్ర ఉందని మాజీ మంత్రి పరిటల సునీత సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

Add Zee News as a Preferred Source

Also Read: YS Jagan: ప్రేమోన్మాది ఘాతుకంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి.. బాబు, పాలనలో రక్షణ కరువు

అనంతపురంలోని తన నివాసంలో ఎమ్మెల్యే పరిటాల సునీత గురువారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45 మంది టీడీపీ నాయకులను హత్య చేశారని తెలిపారు. హత్య రాజకీయాలకు పెట్టింది పేరు జగన్ పార్టీ అని విమర్శించారు. 'నా భర్త పరిటాల రవి హత్యలో జగన్ కి కూడా పాత్ర ఉంది. ఆ రోజు సీబీఐ జగన్‌ను కూడా విచారించింది' అని గుర్తు చేశారు. ఈ హత్యతో పాటు కారు బాంబు, సూట్ కేస్ బాంబుల గురించి సమాధానం చెప్పి జగన్ జిల్లాలోకి అడుగుపెట్టాలని పరిటాల సునీత డిమాండ్ చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన చిన్న సంఘటనను ఫ్యాక్షన్‌గా చిత్రీకరించే ప్రయత్నం జగన్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి. సూట్‌కేస్ బాంబు కూడా ఎవరు పెట్టారో చెప్పాలి' అని సవాల్‌ చేశారు.

Also Read: Kodali Nani: కొడాలి నానికి సర్జరీ విజయవంతం.. ఊపిరి పీల్చుకున్న కుటుంబీకులు

ఫ్యాక్షన్ కారణంగా పరిటాల, గంగుల, సానే కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని.. ఈ మూడు కుటుంబాలు చాలా కోల్పోయాయి' అని మాజీ మంత్రి పరిటాల సునీత వివరించారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న సమయంలో గంగుల భానుమతి, సానే ఉమ కుటుంబాలను రెచ్చగొడుతూ ప్రకాశ్‌ రెడ్డి సోదరులు ప్రయత్నిస్తున్నారని.. ఫ్యాక్షన్‌ మంటల్లో చలికాచుకోవాలని చూస్తున్నారని విమర్‌శించారు. జగన్ పాపిరెడ్డి పల్లెలో లింగమయ్య కుటుంబాన్ని మాత్రమే కాకుండా ఐదేళ్లలో తోపుదుర్తి బ్రదర్స్  బాధితులందరినీ పరామర్శించాలని సవాల్‌ విసిరారు. జగన్‌ వచ్చేప్పుడు సూట్ కేసులో కాస్త దుస్తులు ఎక్కువగా పెట్టుకుని రావాలని సునీత సూచించారు.

పాపంపేటలో ఇళ్లు కూల్చివేతలో తమ పాత్ర ఉందంటూ ప్రకాశ్‌ రెడ్డి సోదరులు చేస్తున్న వ్యాఖ్యలను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఖండించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే పాపంపేటలో ఇళ్ల కూల్చివేత జరిగిందని వివరించారు. కానీ ఇందులో బాధితులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఎంపీపీ ఎన్నిక విషయంలో ప్రకాశ్‌ రెడ్డి తన ఎంపీటీసీల మీద నమ్మకం లేకనే శిబిరాలకు తరలించారని... ఆ ఎన్నికలు తాము గెలవాలనుకుంటే ప్రకాష్ రెడ్డి ఆపలేరని పరిటాల సునీత స్పష్టం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News