Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి వెనక అసలు నిజాలు. . 3 గంటల సీసీ టీవీ పుటేజీతో రచ్చ..

Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మరణం వెనకున్న మిస్టరీ వీడుతోంది. రాజమహేంద్రవరంలో చనిపోయిన పాస్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ విజయవాడలో మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారన్న దానిపై సస్పెన్స్ వీడింది. హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌ బైక్‌పై బయలుదేరిన పాస్టర్‌ ఈనెల 24న విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం చేరుకున్నారు. పోలీసుల దర్యాప్తులో విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఆచూకీ దొరకలేదు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 31, 2025, 11:02 AM IST
Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి వెనక అసలు నిజాలు. . 3 గంటల సీసీ టీవీ పుటేజీతో రచ్చ..

Pastor Praveen: హైదరాబాద్ నుంచి విజయవాడకు బండిపై బయలు దేరిన మార్గమధ్యంలో ప్రవీణ్‌ అలసిపోయి తన బుల్లెట్ బండిని రామవరప్పాడు రింగ్‌కు 50 మీటర్లు ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోకి సాయంత్రం 5 గంటలకే చేరుకున్న ఆయన రాత్రి 8 గంటల 45నిమిషాలకు ఎనికేపాడు దాటినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ మూడు గంటల పాటు ప్రవీణ్‌ ఎక్కడికి వెళ్లారనేది పోలీసులకు సవాలుగా మారింది.మహానాడు జంక్షన్‌ నుంచి ఎనికేపాడు వరకు సుమారు 200 కెమెరాలను పోలీసులు గత రెండు రోజులుగా జల్లెడ పట్టారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే.. గొల్లపూడి వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్‌ బైక్‌ పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. సాయంత్రం 4 గంటల 45నిమిషాలకు విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్‌ బంకుకు ఆయన చేరుకున్నారు. పెట్రోల్‌ పోయించుకొని ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేశారు. పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకొని అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ ప్లైఓవర్ మీదుగా బెంజ్‌ సర్కిల్‌ చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు రామవరప్పాడు రింగ్‌కు కొద్ది దూరంలో బైక్‌ ఆపి కూర్చున్నారు. 

Add Zee News as a Preferred Source

ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుబ్బారావు అతనికి వాటర్ ఇచ్చి ఇచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్నానని ప్రవీణ్‌ ఎస్‌ఐకి చెప్పారు. బైక్‌ హెడ్‌లైట్‌ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్‌ ఎక్కడో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. హెల్మెట్‌ ఉండడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని గమనించారు. ప్రవీణ్‌ ఫొటో తీసుకున్నారు.

పాస్టర్‌ ప్రవీణ్ సాయంత్రం 5 గంటల 30నిమిషాల నుంచి  8 గంటల 30నిమిషాల వరకు అక్కడి పార్కులో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం ఎస్‌ఐ టీ తెప్పించి ఇచ్చారు. తర్వాత తన బుల్లెట్ బండిపై రామవరప్పాడు రింగ్‌ మీదుగా వెళ్లిపోయారు.
మరోవైపు పాస్టర్ ప్రవీణ్ మృతి వ్యవహారంలో కీలకమైన సిసి టీవి ఫుటేజ్ లభ్యమయ్యింది. ఘటన జరగడానికి గంట 42 నిముషాల ముందు పాస్టర్ ప్రవీణ్ వైన్ షాప్ లో మద్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మద్యం కొనుగోలు చేసిన తరువాత యూపిఐ పేమెంట్ చేసినట్టు సిసి టీవి లో రికార్డ్ అయ్యింది.  అంతకు ముందు కోదాడ పరిసర ప్రాంతం లో ఒకసారి మద్యం కొనుగోలు చేసినట్టు పోలీసులు  అనుమానిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ బ్యాంక్ అకౌంట్ లు, యూపిఐ యాప్స్ ఆధారంగా ఎక్కడెక్కడ  మద్యం కొనుగోలు చేశారన్న కోణం లో పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Madhuri Dixit Love Affair: ప్రముఖ క్రికెటర్ తో మాధురి దీక్షిత్ లవ్ ఎఫైర్.. ఎందుకు బ్రేకప్ అయిందంటే..!

ఇదీ చదవండి:  Jaya Prada Husband: నటి జయప్రద పెళ్లై ముగ్గురు పిల్లల తండ్రిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. షాకింగ్ నిజాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News