Pawan kalyan and cm Chandrababu naidu participated in tiranga rally: జమ్ముకశ్మీర్ లో పహల్గం ఉగ్రకుట్రకు ప్రతీకారంగా భారత్ పాక్ ఆపరేషన్ సిందూర్తో విరుచుకుపడింది. దాయాది పాక్ ను భారత్ అన్ని విధాలుగా అష్టదిగ్భంధనం చేసింది. ఈ నేపథ్యంలో భారత్.. పాక్ ను యుద్దంలో దాడులు చేసి వాళ్ల పీచమణించింది. యావత్ భారతావణి ఇండియన్ ఆర్మీ ధైర్యసాహాసాలను, పరాక్రమాన్ని ప్రశంసిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. భారత్ పాక్ యుద్దంపై విజయం సాధించిన నేపథ్యంలో బీజేపీ.. దేశ మంతట కూడ తిరంగా ర్యాలీ కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఏపీలో విజయవాడలో తిరంగ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రొగ్రామ్ కు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Vijaywada | AP CM Chandrababu Naidu participates in the Tiranga Run Programme (IGMS TO Benz Circle) | AP Dy CM PAwan Kalyan speech#TirangaRun #AndhraPradesh #PawanKalyan pic.twitter.com/BFvKnSfHYV
— Deccan Chronicle (@DeccanChronicle) May 16, 2025
ఈనేపథ్యంలో పవన్ కళ్యాన్ దాయాది పాక్ పై విరుచుకుపడ్డారు. మన డెవలప్ మెంట్ చూసి పాక్ ఓర్చుకోలేక కుటిల కుతంత్రాలు పన్నుతుందన్నారు. మనదేశంలో జరిగిన దాడులన్నింటి వెనుకాల పాక్ హస్తముందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాక్ ఉద్రవాదులకు కర్మాగారంగా మారిందన్నారు. కానీ భారత్ మాత్రం పాక్ ను అన్ని కుయుక్తుల్ని తిప్పికొడుతుందన్నారు.
మనదేశం జొలికి వస్తే చూస్తే ఊరుకునేదిలేదన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన.. మురళి నాయక్ ను ఆదర్శంగా తీసుకొవాలన్నారు. మరోవైపున చంద్రబాబు మాట్లాడుతూ.. పాక్ కుట్రలు, కుతంత్రాలు భారత్ ను ఏమి చేయలేవన్నారు. మహిళల సిందూరం తుడిస్తే.. ఏమౌతుందో ఆపరేషన్ సిందూర్ తో కౌంటర్ ఇచ్చామన్నారు. మురళినాయక్ ను యువత ఆదర్శంగా తీసుకొవాలన్నారు. దేశానికి మోదీ సరైన సమయంలో ప్రధానిగా ఉన్నారన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Facebook, Twitter