Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్

Mark Shankar with Pawan in Hyderabad video: మార్క్‌ శంకర్‌ కోలుకోవడంతో సింగపూర్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు పవన్‌ కల్యాణ్‌. ఆయనతోపాటు సతీమణి అన్నాలెజినోవా కూడా ఉన్నారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 13, 2025, 07:14 AM IST
Pawan Kalyan Video: కోలుకున్న మార్క్‌ శంకర్‌.. హైదరాబాద్‌ తీసుకువచ్చిన పవన్‌ దంపతుల వీడియో వైరల్

Mark Shankar with Pawan Kalyan in Hyderabad video: ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కొడుకు ఈ నెల 9వ తేదీ సింగపూర్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మార్క్‌ శంకర్‌ చేతులకు , కాళ్లకు గాయాలు అయ్యాయి. అంతేకాదు మంటల వల్ల పొగ మార్క్‌ ఊపిరితిత్తులకు చేరడంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో సింగపూర్‌లోనే ఆసుపత్రిలో మార్క్‌కు మెరుగైన వైద్యం అందించారు. ఆ తర్వాత నిన్న శనివారం రోజు కోలుకున్న మార్క్‌ శంకర్‌ను పవన్ కల్యాణ్‌ దంపతులు హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఎయిర్‌పోర్ట్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Add Zee News as a Preferred Source

పవన్‌ దంపతులు మార్క్‌ శంకర్‌ను హైదరాబాద్‌ తీసుకవచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో డిప్యూటీ సీఎం స్వయాన తన కొడుకు మార్క్ శంకర్‌ను భుజాన ఎత్తుకొని వచ్చారు. అయితే, అతనితోపాటు అన్నా లెజీనోవా, కూతురు కూడా కనిపిస్తున్నారు. అయితే ఘటన జరిగిన ఆ రోజే మెగాస్టార్ చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ కూడా సింగపూర్‌కు మార్క్ శంకర్‌ను చూడటానికి వెళ్లారు. ఒక పరిస్థితి సద్దుమణగడంతో పవన్ మళ్ళీ యథావిధిగా తన పనుల్లో మునిగిపోయే అవకాశం ఉంది. సింగపూర్‌ స్కూలులో అగ్నిప్రమాదం సమయంలో పవన్‌ మన్నెం పర్యాటనలో ఉన్నారు. పర్యాటన ముగించుకుని వెంటనే ఆయన తన అన్న మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖలతో కలిసి సింగపూర్ బయలుదేరారు. అదే కాదు రెండు సినిమా ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం మార్క్‌ శంకర్ కోలుకున్నాడని చిరంజీవి కూడా ఇటీవల పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. తమతో పాటు తమ అభిమానులు మార్క్‌ శంకర్ కోలుకోవాలని ప్రార్థనలు చేశారు ధన్యవాదాలు కూడా తెలియజేశారు. ఆంజనేయ స్వామి దయవల్ల పెద్ద గండం నుంచి బయటపడ్డాడని ఆయన పోస్ట్ పెట్టారు.

 

 

Read more: Pawan Kalyan Son: పవన్ కొడుకు హెల్త్‌పై జుగుప్సాకరమైన పోస్టులు.. ఏపీ పోలీసులు సీరియస్..

ఇక సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 19 మంది చిన్నారులు గాయపడ్డారు. వెంటనే స్కూల్ యాజమాన్యం స్పందించడంతో ఆ ప్రాణాపాయం తప్పింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా మార్క్‌ శంకర్ త్వరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున పూజలు కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్క్‌ హనుమాన్‌ జయంతి రోజే ఇండియాకి తిరిగి వచ్చాడు..

Read more:  నేటి రాశి ఫలాలు.. ఈ రాశి కోపం తగ్గించుకుంటే మంచిది, పనిలో పురోగతి..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News