Pawan About His Father: సెకండ్ షో సినిమా కెళ్తే.. మా నాన్న తిట్టాడు..

Pawan About His Father: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా తాను చినపుడు సెకండ్ షో సినిమా కు ఇంట్లో తెలియకుండా వెళ్తే నాన్న తిట్టిన విషయాన్ని ప్రస్తావించారు.    

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 15, 2025, 10:47 AM IST
Pawan About His Father: సెకండ్ షో సినిమా కెళ్తే.. మా నాన్న తిట్టాడు..

Pawan About His Father: వీడు బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి.  వీడికి ఆస్తమా ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్ల నివ్వకుండా ఉండేవారు. ఒకరోజుచెన్నైలో నేను అన్నానగర్ లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని.  ఓ రాత్రి 10:30 అయింది. రోజు సాయంత్రం ఆరు గంటలకు వెళ్లిపోవాలి. కాస్త ఆలస్యమైంది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే..ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటదో రాత్రి 10:30కి నేను ఇంటికి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తా ఉన్నారు.  మా వదిన ఇంట్లో హాల్ లో ఉంది. మా నాగబాబు వీధి బయట
తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరూ ఏమైపోయాడు ఎక్కడికి పోయాడు అని నేను ఎగ్జామ్ రాసి వస్తున్నాను బస్సులు దొరకలేదు. నేను  రెండుబస్సులు మారి రావాలని చెప్పాను. నాకు కార్లు లేవు. ఆ టైంలో అలా నన్ను పెంచారు.

Add Zee News as a Preferred Source

ఇదిగో మా నాగబాబు గారు ఇక్కడే ఉన్నారు అడగండి. ఆరోజు గుర్తుండి ఉంటది. ఆయనకి అలాంటి నేను పాలిటిక్స్ చేస్తానని గాని సినిమాల్లోకి వస్తానని గాని అని ఎవరుఊహించలే. ఎందుకంటే నేనే ఊహించలే పోనీ 18 ఏళ్ల వయసులోనో.. 20 ఏళ్ల వయసులోనో 10:30రకి లేట్ గా వచ్చావు అంటే ఒక అర్థం ఉంటది.  అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిగోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ చేస్తున్న సమయంలో  అటో ఇటో హైదరాబాద్ సంగీత్ థియేటర్ లో ఓ ఇంగ్లీష్ సినిమాకు వెళ్లాను.

అది ఎలా తీశారని సినిమాకు వెళ్లాను. అప్పటికీ తొలి ప్రేమ షూటింగ్ అయిపోయింది.  నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ని హరీష్ పైని ఇంకోఇద్దరు ముగ్గురి తోటి సెకండ్ షో కివెళ్ళా.  సెకండ్ షో కి వెళ్లి ఇంటికి వస్తే పైన రూమ్ లోపడుకోవాల్సిన మా నాన్న కింద కుర్చీవేసుకొని  నాకోసం వెయిట్ చేస్తున్నారు.  ఎక్కడికి రా వెళ్ళావు అని షూటింగ్ అన్నాను.  షూటింగ్ సినిమాకి వెళ్ళాను అంటే ఆయన ఎట్లా తిట్టాడు అంటే నేను ఏదో నేను చాలా తప్పుడు పనులు చేసేస్తున్నట్టుగా ఏదో బారులో కూర్చొని తాగేసినట్టుగా మా నాన్న చూసారు.  నేను అప్పటికి కొంచెం గుండె ధైర్యం తెచ్చుకొని చెప్పాను.  

నన్ను కొట్టింది తక్కువ కానీ మా అన్నయ్యలను కొట్టింది ఎక్కువ.  సో యముడికి మొగడులో ప్రసాద్ బాబు ఉంటాడు. చిరంజీవి  పక్క వ్యక్తిని కొడితే ఇతను లైన్ లోకి వచ్చేస్తాడు. అక్కడ నేను డిసిప్లిన్ లోకి వచ్చాను.  అట్లాగే వీళ్ళని కొడితే నేను డిసిప్లిన్ లోకి వచ్చాను.  నాకు ఆయన కొట్టక్కర్లేదు నేను డిసిప్లిన్ గా ఉంటాను అనేవారు.  సో నాకు మానాన్న చూడగానే భయమేసింది. కొంచెం బలం తెచ్చుకొని మూడు సినిమాలు హిట్లు వచ్చినాయి. నాలుగో సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయింది. తొలి ప్రేమ నాన్న నేను హీరో అన్న సంగతి కూడా మర్చిపోకు నువ్వు అర్థం చేసుకో అని చెప్పారు.  ఈ అర్ధరాత్రి అపరాత్రి తిరుగుళ్ళు ఏంట్రా ఈ సెకండ్ షోలోకి వెళ్ళడం ఏంటి ?

కోట్ల మందికి సంబంధించిన పాలిటిక్స్ వేయాలంటే భగవంతుడు రాసిన రాత కాకపోతే నేను కాదు. అది అలాంటి అలాంటి వాతావరణంలో పెరిగిన నేను ఈ సినిమాలు ఏంటో ఈ పాలిటిక్స్ ఏంటో పార్టీ పెట్టడం ఏంటో అని అనుకుంటే ఇందాక వచ్చేవాడిని కాదు.   ఇదంతా భగవంతుడు మాయ తప్ప నాది కాదు అని నాకు తెలుసు.ప్రజా సమస్యలపై నిలబడేలా చేసింది. పార్టీ పెట్టనిచ్చిందన్నారు.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News