
Pawan Kalyan: కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయని అన్నారు. కశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి, మధుసూదన్ రావు భౌతిక కాయాలను సందర్శించి నివాళులర్పించారు పవన్. పెహల్గామ్ బాధితుల వేదన చూస్తే మాట రావడం లేదన్నారు. ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించేందుకు అంతా ఏకతాటి పైకి రావాలని పిలుపునిచ్చారు.మతం అడిగి మరీ కాల్చి చంపడం అత్యంత హేయం అన్నారు.
ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్ధాక్షిణ్యంగా ఏరిపారేయాలన్నారు. ఏ మతధర్మం ఆచరిస్తారని అడిగిమరీ చంపారంటే ఎంతటి దారుణం అని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధిని తట్టుకోలేకే ఇంతటి కిరాతకానికి ఒడిగట్టారని మండిపడ్డారు. షూటింగ్‌ల కోసం చాలాసార్లు తాను కశ్మీర్ వెళ్లాననీ.. అక్కడి పరిస్థితి తెలుసు అని అన్నారు. అటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , మంత్రి ఆనం రాంనారాయణ్ రెడ్డి సైతం మధుసూదన్‌రావు మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి హేమమైన చర్య అని ఏపీ ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఉగ్రవాదులకు త్వరలోనే భారత ప్రభుత్వం గట్టిగాబుద్ధి చెబుతోందన్నారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడి చేయడం పిరికి పంద చర్య అని విమర్శించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి హైదరాబాద్ కూకట్‌పల్లిలో జనసేన ఆధ్వర్యంలో నివాళి ఆర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నేమోరి శంకర్‌గౌడ్‌తో కలిసి నాగబాబు పాల్గొన్నారు. మృతి చెందిన వారికి నివాళులు అర్పించి..వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe