Pawan Kalyan Son Health Update: సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడు గాయపడిన విషయమై సినీ నటుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. తన కుమారుడి పాఠశాలలో ప్రమాదం వివరాలను వెల్లడించారు. వేసవి శిబిరానికి వెళ్లిన తన కుమారుడి పాఠశాలలో ఆ ప్రమాదం జరిగిందని.. మంటల ధాటికి వచ్చిన పొగ కారణంగా తన కుమారుడు ఆరోగ్యం దెబ్బతిన్నదని పవన్ కల్యాణ్ తెలిపారు.
Also Read: Mark Shankar: స్కూల్లో భారీ అగ్నిప్రమాదం.. చిక్కుకున్న డిప్యూటీ సీఎం పవన్ కొడుకు మార్క్ శంకర్..
తన కుమారుడిని చూసేందుకు సింగపూర్ వెళ్లేముందు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. తన కుమారుడి పరిస్థితి వివరించారు. 'అరకు పర్యటన ఉండగా ఉదయం 7:30 గంటలకు నాకు కాల్ వచ్చింది. నా భార్య ఫోన్ చేసి మార్క్ శంకర్‌కు అగ్నిప్రమాదంలో గాయాలయ్యాయని చెప్పింది' అని వెల్లడించారు. వేసవి శిబిరానికి మార్క్ శంకర్‌ను పంపాం. ప్రస్తుతం శంకర్‌కు వైద్య చికిత్స అందుతోంది.
Also Read: YS Jagan: 'డొనల్డ్ ట్రంప్ మీద నెట్టేసి సీఎం చంద్రబాబు నిద్రపోతున్నారా?'
'నా కుమారుడి ప్రమాదం విషయం తెలిసి ప్రధాని మోదీ, చంద్రబాబు, కేటీ రామారావు, మాజీ సీఎం జగన్ తదితరులు పరామర్శించారు. ఫోన్ చేసి పరామర్శించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. 'నా పెద్ద కొడుకు అకీరా పుట్టిన రోజు వేళ రెండో కుమారుడికి ఈ ఘటన జరగడం బాధాకరం' అని చెప్పారు. తాను సింగపూర్ వెళ్తున్నట్లు.. కానీ చిరంజీవి రావడం లేదని వెల్లడించారు.
'ప్రమాదం వలన పొగ మార్క్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. ఆ ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందడం కలచివేసింది. దాదాపు 30 మంది ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు' అని డిప్యూటీ సీఎం వివరించారు. 'మొదట చిన్న ప్రమాదం అనుకున్నా. తర్వాత పెద్ద ప్రమాదమని తెలిసింది. చెయ్యి, కాలికి గాయాలు అయ్యాయని తెలిసింది. నా కుమారుడు పక్కనే కూర్చున్న విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పారు. సింగపూర్ హై కమిషన్‌తో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. నా అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దు' అని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. తన అన్న చిరంజీవి తన వెంట రావడం లేదని.. ఈ విషయం ఇంకా కుటుంబసభ్యులతో మాట్లాడలేదని పవన్ కల్యాణ్ తెలపడం గమనార్హం. కాగా కుమారుడి కోసం రాత్రి 9.30 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









