JanaSena Jayaketana Sabha: 'ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకు వేశాం.. విజయం సాధించాం. నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం. ఎన్డీయే కూటమిని నిలబెట్టాం' అని జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. తనను అణచివేసే కుట్ర జరిగిందని చెప్పారు. 'అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేనని శపథాలు చేశారు. కానీ దేశమంతా తలతిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం' అని పవన్ కల్యాణ్ భావోద్వేగంగా తెలిపారు.
Also Read: JanaSena Party: ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఖర్మ.. జనసేన సభలో నాగబాబు సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో శుక్రవారం రాత్రి జరిగింది. జయకేతన సభ పేరిట జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. '2019లో ఓడినా అడుగు ముందుకు వేశాం. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అండగా నిలబడ్డాం. నాపై చేయని కుట్ర లేదు.. కుతంత్రం లేదు' అని పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన జన్మస్థలం తెలంగాణ.. కర్మస్థలం ఆంధ్రా అని ప్రకటించారు.
Also Read: 4 Days Banks Close: 4 రోజులపాటు బ్యాంకులు బంద్? కారణం ఇదే!
'2024లో దాష్టీక ప్రభుత్వాన్ని దించి, ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించిన మీకందరికి ధన్యవాదాలు' అని ప్రజలకు పవన్ కల్యాణ్ చెప్పారు. తెలంగాణ భూమికి నా హృదయ పూర్వక ధన్యవాదాలని తెలిపారు. 'నా గద్దరన్న నేలనుంచి వచ్చిన తెలంగాణ జనసేన కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మా జనసేన ఆడపడుచులు, వీర మహిళలు మా రాణీ రుద్రమ్మలు' అని తెలంగాణపై జనసేన ప్రశంసలు చాటారు.
'2019లో ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు. జబ్బలు చరిచారు. ఆడబిడ్డల్ని అవమానించారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే కేసుల పేరుతో జైలులో వేశారు' అని పవన్ కల్యాణ్ వివరించారు. భయం లేదు కాబట్టే తాను ఇంత దూరం వచ్చానని.. గుండె ధైర్యమే కవచం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పార్టీ సభకు వచ్చి సినిమాల గురించి మాట్లాడవద్దని.. అందుకే మాట్లాడడం లేదని తెలిపారు. జనసేన విజయం సాధించడానికి కారణం ఏడు సిద్ధాంతాలు అని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









