Janasena Formation Day: ఈ రోజు జనసేన పార్టీ పండుగ. జనసేన పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్ళు పూర్తి చేసుకుంది.ఈ సందర్భంగా ఆవిర్భావ సభను పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇలాఖా అయిన పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. VVIP, VIPలు, వీర మహిళలు, జన సైనికుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హైవే పక్కన 8 చోట్ల ఎల్‌ఈడీ తెరలు, వేదిక నుంచి 4 కిలోమీటర్ల దూరం వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పలు మార్గాల్లో చర్యలు తీసుకున్నారు. ఆరు చోట్ల పార్కింగ్ ప్లేస్‌లు ఏర్పాటు చేశారు. సభకు భారీగా పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు వస్తారన్న అంచనాతో 1,700 మంది పోలీసులకు తోడు 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేశారు.
సభ మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. ఇక చివర్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర, ప్రాధాన్యతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే.. 2008లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం లో యువరాజ్యం అధినేతగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 సీట్లతో పాటు 18 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఇదో చిన్న విషయం కాదు. ఆ తర్వాత అన్న ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత వెయిట్ చేసి 2014లో జనసేన పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో తెలుగు దేశం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. కానీ ఏ సీట్లలో ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత కనీసం ఏ పదవి తీసుకోకుండా కూటమి తరుపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి జనసేన కేవలం ఒక సీటుకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసినా రెండు చోట్లా పోటీ ఓటమి పాలయ్యారు. దీంతో ఎక్కడా నిరాశా పడకుండా.. పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవడం అన్నట్టు.. గోడకు కొట్టిన బంతిలా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, తెలుగు దేశం, జనసేన కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.
అంతేకాదు అధికారంలో ఉన్న వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి.. ఏపీలో కూటమి ఏర్పాటు చేసి 21 అసెంబ్లీ.. 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల నెగ్గి 100కి 100 శాతం స్ట్రైక్ రేట్ సాధంచిన పార్టీగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేసారు. అంతేకాదు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేయగలిగారు. ఓ రకంగా 2024 ఎన్నికల్లో వైసీపీ గద్దె దిగడానికి.. తెలుగు దేశం పార్టీ అధినేత.. చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం పవన్ కళ్యాణ్ కారణమే చెప్పాలి. అటు ఉత్తరాదిలో దెబ్బ తిన్న బీజేపీకి ఏపీలో పవన్ కళ్యాణ్ చాణక్యమే నరేంద్ర మోడీని ప్రధాని కాగలిగేలా చేసింది. మొత్తంగా 2024 ఎన్నికల్లో మన రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనే అసలు సిసలు గేమ్ ఛేంజర్ గా నిలిచారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









