close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

కేసీఆర్ సర్కార్ కు పవన్ కల్యాణ్ విఙ్ఞప్తి

హైదరాబాద్ సినీ కార్మికుల సమస్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు

Updated: Sep 10, 2019, 11:15 PM IST
కేసీఆర్ సర్కార్ కు పవన్ కల్యాణ్ విఙ్ఞప్తి

హైదరాబాద్ లో నివసిన్తున్న సినీ కార్మికుల తరఫున  పవన్ కల్యాణ్ తన వాయిస్ వినిపించారు. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలుగు సినీ వర్కర్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యులతో ఈ రోజు పవన్ సమావేశమయ్యారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో కార్మికులు పడుతున్న ఇబ్బందులను పవన్ కల్యాణ్ కమిటీ ముందుకు తీసుకొచ్చారు. హౌసింగ్ సొసైటీ సభ్యులు కూడా ఇళ్ల కేటాయింపుల్లో తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో స్పందించిన పవన్ ... సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం మరికొంత స్థలం కేటాయించాలని టి సర్కార్ ను కోరుతామన్నారు.

ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ  సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన స్థలం సరిపోవడం లేదని ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని మరికొంత స్థలం కార్మికుల గూడు కోసం కేటాయించాలని కోరారు. ఒకవైపు కోట్లాది మందికి వినోదం అందిస్తున్న చిత్ర పరిశ్రమ... మరోవైపు నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం సమకూర్చుతోందన్నారు. చిత్ర పరిశ్రమ ప్రత్యక్షంగా.. పరోక్షంగా లక్షలాది మందికి  ఉపాధి కల్పిస్తుంది. ఇలాంటి పరిశ్రమలో చాలా సాధకబాధకాలు ఉన్నాయి. వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని పవన్ విఙ్ఞప్తి చేశారుకేసీఆర్ సర్కార్ కు పవన్ కల్యాణ్ విఙ్ఞప్తి
 

Tags: