)
Pawan kalyan reacts on single elephant attacks incident: చిత్తూరు జిల్లా పలమనేరులో ఒంటరి ఏనుగు విధ్వంసం సృష్టించింది. ఉదయం 6 గంటలకు జనావాసాల్లోకి ప్రవేశించిన ఏనుగు రచ్చ చేసింది. ఏనుగును తిరిగి అడవిలో పంపిద్దామని వచ్చిన ఫారెస్ట్ సిబ్బందికి చుక్కలు చూపెట్టింది. హైవే పక్కనే తిష్ట వేయడంతో ఏనుగును చూడడానికి పట్టణ ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.
మొదటగా చిన్నూరు బ్రిడ్జి సత్యనారాయణ గుడి వద్ద నుండి గంగవరం వైపు వెళ్తుండగా అడవిలోకి మళ్లించే ప్రయత్నం చేసిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ పై ఏనుగు దాడి చేసింది. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్రంగా గాయమైంది. ఆ తర్వాత టపాకాయలు పేలుస్తు ఏనుగును.. గంగవరం నుండి గంటావురు ఆంజనేయ స్వామి ఆలయం వెనక ఉన్న అడవిలోకి అటవీ అధికారులు తరలించారు.
ఫారెస్ట్ సెక్షన్ అధికారి సుకుమార్ కు కాలు విరగడంతో అటవీశాఖ అధికారులు ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో దాడి ఘటనపై
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. అంతే కాకుండా.. అధికారులకు కీలక ఆదేశాలు జారీచేశారు. విధి నిర్వహణలో గాయపడిన ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గాయపడిన సుకుమార్, హరిబాబుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావుకు ఫోన్లో సూచించారు. "ఏనుగుల కదలికలపై రానున్న రోజుల్లో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ.. అవసరమైతే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులతో గస్తీ నిర్వహించాలని కూడా పవన్ కళ్యాన్ అధికారుల్ని ఆదేశించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook