Pawan Kalyan: జనసేన పార్టీ సిద్ధాంతాలను మరో సారి స్పష్టం చేశారు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్. పర్యావరణం విధ్వంసం చేసేలా పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం తమ పార్టీ విధానాలకు విరుద్ధమన్నారు. బహిరంగసభలు నిర్వహించినా వాటిని పార్టీ శ్రేణుల చేత శుభ్రం చేసి మళ్లీ ప్రజలకు ఉపయోగపడేలా తయారుచేసి అందించాలన్నారు. జనసేన పార్టీ ఆ విధానాన్ని తూచా తప్పకుండా పాటిస్తుందన్నారు. ఈ నెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగిన జయకేతనం బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు, పార్టీ శ్రేణఉలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతం అంతా ప్లాస్టిక్ కవర్లతో, వాడి పడేసిన వాటర్‌బాటిల్స్‌తో అపరిశుభ్రంగా తయారయ్యింది. దానిని శుభ్రం చేశారు. ఆ విజ్యువల్స్‌ను ట్యాగ్ చేస్తూ పార్టీ విధానాలను మరోసారి ప్రకటించారు. మొత్తంగా జనసేన చెప్పడమే కాదు.. దాన్ని ఆచరించి చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. మొత్తంగా తన పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ గల సైనికులను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ పలు అంశాలను సృశించారు.
ఈ సభలో దక్షిణాది బాల్ థాక్రే మాదిరి ప్రసంగించారు. అంతేకాదు దేశంలో కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో ప్రజలను విడదీస్తున్న స్టాలిన్ వంటి నేతలకు చురకలు అంటించారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలమన్నారు. త్రిభాష సిద్ధాంతం వద్దు.. హిందీ మాకొద్దు అనే తమిళ నాయకుకులు గట్టిగానే గడ్డి పెట్టాడు. మరోవైపు 40 యేళ్ల తెలుగు దేశం పార్టీకి తామే పూర్వ వైభవం తీసుకొచ్చామని చెప్పిన కొన్ని మాటలు కూటమిలో ప్రకంపనలు రేపినా.. తెలుగు దేశం శ్రేణులు ఈ విషయమై సంయమనం పాటించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









