Pawan Kalyan: రప్పా..రప్పా.. నరుకుతాం..!.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. ఏపీలో పెను దుమారం..

Pawan kalyan serious on ys jagan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. డైలాగ్ లు సినిమా థియేటర్ వరకు మాత్రమే బాగుంటాయని సెటైర్ లు వేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 20, 2025, 02:39 PM IST
  • ఏపీలో ముదిరిన డైలాగ్ వార్..
  • జగన్ పై పవన్ కళ్యాణ్ పంచ్ లు..
Pawan Kalyan: రప్పా..రప్పా.. నరుకుతాం..!.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్.. ఏపీలో పెను దుమారం..

Pawan kalyan Serious on ys jagan over pushpa 2 dialogue: వైఎస్ జగన్ ఇటీవల గుంటూరు, పల్నాడు యాత్రలలో భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. ఎక్కడ చూసిన జగన్ కాన్వాయ్ వెంట వైసీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఎక్కడ చూసిన జగన్ కోసం కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. అయితే.. ఇటీవల జగన్ పర్యటలో పుష్ప2 సినిమాలోని ఫెమస్ డైలాగ్ రప్పా.. రప్పా.. నరుకుతాం అంటూ కొంత మంది ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఇది కాస్త పెద్ద వివాదంగా మారింది. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం సీరియస్ అయ్యారు. ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరోవైపు.. మాజీ సీఎం జగన్ పుష్ప 2 సినిమాలోనిఫ్లెక్సీ పెడితే తప్పేంటని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా..?.. లేని నియంత పాలనలో ఉన్నామా..?.. అని మండిపడ్డారు. ఈ క్రమంలో పుష్ప డైలాగ్ లపై ప్రస్తుతం  ఏపీలో పెద్ద రచ్చనడుస్తుంది.

మరోవైపు..  దీనిపై తాజాగా.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  సినిమాలోని డైలాగ్ లు.. థియేటర్ వరకు మాత్రమే బాగుంటాయన్నారు. కానీ వాటిని ఆచరణలో పెడతాము.. ప్రజా జీవితంలో ఇష్టమున్నట్లు మాట్లాడితే.. అది సబబు కాదన్నారు.  అంతేకాకుండా.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తెలా ప్రవర్తిస్తే... రౌడీషిట్ లను ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.

Read more: YS Jagan Video: చంద్రబాబు ఉంగరం సెంటిమెంట్ ఫాలో అవుతున్న జగన్.!. రాజ్యాధికారం కోసమేనా..?.. నెట్టింట కొత్త చర్చ.. వీడియో వైరల్..

ఎవరైన సరే.. చట్టాలకు లోబడి.. ప్రజాస్వామ్యంలో కాంట్రవర్సీలు అయ్యే విధంగా మాట్లాడితే చట్టం చూస్తు ఊరుకొదన్నారు.  అ సాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అంతేకాకుండా.. ఇలాంటి వాటికి సపోర్ట్ గా మాట్లాడటం కూడా నేరమే అవుతుందన్న విషయం మర్చిపోవద్దని మాజీ సీఎం జగన్ కు.. పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News