Pawan Serious: పవన్ వెనకాల ఆ నలుగురు పెద్ద కుట్ర..ఇచ్చిపడేసిన జనసేనాని..

Pawan Serious On Tollywood : ఎవరినైతే గెలక్కూడదో వారిని గెలికారు ఇండస్ట్రీ పెద్దలు. పవన్ కళ్యాణ్ కు రిటర్న్ గిఫ్ట్ ఇద్దామనుకున్న సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ అదే రీతిలో వాయించి పడేసాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : May 25, 2025, 07:54 AM IST
Pawan Serious: పవన్ వెనకాల ఆ నలుగురు పెద్ద కుట్ర..ఇచ్చిపడేసిన జనసేనాని..

Pawan Serious On Tollywood : ఏదైతే చేయకూడదో అది కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి రాష్ట్రంలో, కేంద్రంలో మంచి ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ను గెలకడంతో ఒక్కసారి పవన్ లో ఉన్న ఆవేశం బయటకు కట్టలు తెచ్చుకుంది.  ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ .. సినీ పరిశ్రమపై సీరియస్‌గా స్పందించారు. సినీ పరిశ్రమ పెద్దలను టార్గెట్ చేస్తూ.. పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

Add Zee News as a Preferred Source

గత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన వారిని ఎలా ఛీత్కరించిందో మరిచిపోయినట్లు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇకపై ప్రభుత్వంతో సినీ ప్రముఖుల వ్యక్తిగత చర్చలు ఉండవన్నారు. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలంటూ వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తుంటే.. ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత సినీ పెద్దల్లో కనిపించడం లేదని మండిపడ్డారు.

ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  థియేటర్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఎవరున్నారో విచారణ చేయిస్తామని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. హరిహరవీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ చేయాలనే నిర్ణయం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు. కావాలనే ప్రభుత్వంలోని పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి సినిమానే టార్గెట్ చేయడం వెనక ఏదో తెలియని రాజకీయం ఉందని చెప్పారు.  గత ప్రభుత్వం తరహాలో టికెట్ల రేట్లు పెంచి, సినిమా షూటింగుల అనుమతి కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టబోమని విమర్శించారు. హెం శాఖ సిబ్బందితో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపిస్తామని కందుల దుర్గేష్ అన్నారు.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:   కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News